కోడి పందాలపై ఆర్డినెన్స్‌కు బీజేపీ నేత విజ్ఞప్తి- రేస్ కోర్స్ గుర్తు చేస్తున్న ఎంపీ

సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జోరు మొదలైంది. టీడీపీ ఎంపీ మాగంటిబాబు స్వయంగా అధికారుల సమక్షంలోనే కోడిపందాలు ప్రారంభించారు. పుంజులు పట్టుకుని బరిలోకి వదిలారు. బాడీ బిల్డర్స్‌తో కలిసి మాగంటి బాబు ఫోజులిచ్చారు. కోడిపందాల నిర్వాహణపై వస్తున్న విమర్శలను ఎంపీ తోసిపుచ్చారు. కోడి పందాలు సంస్కృతి పరిరక్షణలో భాగమన్నారు. కోళ్లకు కత్తులు కట్టడం లేదని.. పందాలు కాయడానికి తమ దగ్గర డబ్బులెక్కడున్నాయని మాగంటి బాబు ప్రశ్నించారు. రేస్‌ కోర్పులు జరగడం లేదా వాటి గురించి […]

Advertisement
Update:2016-01-13 04:09 IST

సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జోరు మొదలైంది. టీడీపీ ఎంపీ మాగంటిబాబు స్వయంగా అధికారుల సమక్షంలోనే కోడిపందాలు ప్రారంభించారు. పుంజులు పట్టుకుని బరిలోకి వదిలారు. బాడీ బిల్డర్స్‌తో కలిసి మాగంటి బాబు ఫోజులిచ్చారు. కోడిపందాల నిర్వాహణపై వస్తున్న విమర్శలను ఎంపీ తోసిపుచ్చారు. కోడి పందాలు సంస్కృతి పరిరక్షణలో భాగమన్నారు. కోళ్లకు కత్తులు కట్టడం లేదని.. పందాలు కాయడానికి తమ దగ్గర డబ్బులెక్కడున్నాయని మాగంటి బాబు ప్రశ్నించారు. రేస్‌ కోర్పులు జరగడం లేదా వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

మరోవైపు కోడిపందాల అనుమతులు కోసం పోరాటం చేస్తున్న బీజేపీ నేత రఘురామకృష్టమరాజు … కోడి పందెలు నిర్వహించుకునేందుకు ఆర్డినెన్స్ ఇవ్వాలంటూ బీజేపీ అధిష్టానాన్ని కోరారు. కోడి పందేలు తెలుగు సంస్కృతికి సంబంధించిన అంశమని, ఇందుకు అన్నిపార్టీలు సహకరించాలన్నారు. సంస్కృతి పట్ల తమిళనాడు ప్రజలకున్న శ్రద్ధ తెలుగుప్రజలకు ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News