గ్రేటర్ లో గులాబీ వ్యూహం ఇదే!

గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల్లో గెలుపే లక్ష్యం. హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటితేనే మన విజయం సంపూర్ణమైనట్టు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. ఇవీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించునేందుకు సీఎం కేసీఆర్ పక్కా వ్యూహం రచించారు. మొత్తం 150 డివిజన్లు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. ప్రతి డివిజన్ లో 1000మంది ఓటర్లకు ఒకరిని ఇంచార్జ్ గా నియమించారు. అంతేకాదు ప్రతి డివిజన్ కు 45మందితో […]

Advertisement
Update:2016-01-08 07:34 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం. హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటితేనే మన విజయం సంపూర్ణమైనట్టు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. ఇవీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించునేందుకు సీఎం కేసీఆర్ పక్కా వ్యూహం రచించారు. మొత్తం 150 డివిజన్లు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. ప్రతి డివిజన్ లో 1000మంది ఓటర్లకు ఒకరిని ఇంచార్జ్ గా నియమించారు. అంతేకాదు ప్రతి డివిజన్ కు 45మందితో ప్రచార కమిటీ ఏర్పాటు చేశారు. డివిజన్ కు ఓ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని కూడా ఇంచార్జ్ గా నియమించారు. ఇక గ్రేటర్ లోని అన్ని నియోజకవర్గాలకు ఒక్కొక్క మంత్రి ఇంచార్జ్ గా ఉంటారు. ఇలా కిందిస్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు పక్కా ప్రణాళికతో టీఆర్ఎస్ ఎన్నికల కదనరంగంలోకి దూకుతోంది.
ఎన్నికల్లో గెలవడానికి రకరకాల వ్యూహాలను రచిస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే నీటి బిల్లులు, విద్యుత్ బకాయిలు రద్దు చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రచారాస్ర్తంగా వాడుకుంటోంది. తాజాగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికే సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా కూకట్ పల్లి, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, శేర్‌లింగంప‌ల్లి ఏరియాల్లో దాదాపు 15 మంది సెటిలర్స్‌ను ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున పోటీ చేయించేందుకు కసరత్తు చేస్తోంది. ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌ వారు అధికంగా ఉంటే అల్వాల్‌, మేడ్చల్ లాంటి ఏరియాల్లో వారికీ అవకాశం ఇస్తామంటూ ఊరిస్తోంది. దీంతో సెటిల‌ర్లలో ఓ స్థాయి నేతల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు గులాబీ పార్టీ గుర్తుతో పోటీకి సై అంటున్నారు.
అభ్యర్థుల ఎంపికలోనూ టీఆర్ఎస్ కొత్త విధానాన్ని అవలంభించబోతోంది. ప్రతి డివిజన్‌లో సెలక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్ధులను ఖరారు చేయనుంది. నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు పార్టీ అభ్యర్థిగా ఎవరికీ బీఫాం ఇవ్వరు. చివరి రోజు మాత్రమే పార్టీ అభ్యర్థికి బీఫామ్ ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మొత్తం మీద గ్రేటర్ లో మేయర్ పీఠమే లక్ష్యంగా టీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులు ఏమేరకు ఫలిస్తాయన్నది వచ్చే నెలలో తేలిపోనుంది.
Tags:    
Advertisement

Similar News