కాళ్లు పట్టుకోవాల్సి వస్తోంది... కర్మ
ఏపీ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తప్పుపట్టారు. ప్రతిపనికీ జన్మభూమి కమిటీలను ముందు పెట్టడాన్ని విమర్శించారు. అర్హులు కూడా ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీల కాళ్లు పట్టుకోవాల్సి వస్తోందని… ఈ పరిస్థితి చూస్తుంటే కర్మ పట్టి చంద్రబాబును గెలిపించినట్టుగా ఉందని అన్నారు. కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి డీఎల్ వచ్చారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇళ్లు, పించన్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన చాలా మందికి పథకాలు అందడం లేదన్నారు. జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన డీఎల్‌ను సభావేదికపైకి అధికారులు […]
ఏపీ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తప్పుపట్టారు. ప్రతిపనికీ జన్మభూమి కమిటీలను ముందు పెట్టడాన్ని విమర్శించారు. అర్హులు కూడా ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీల కాళ్లు పట్టుకోవాల్సి వస్తోందని… ఈ పరిస్థితి చూస్తుంటే కర్మ పట్టి చంద్రబాబును గెలిపించినట్టుగా ఉందని అన్నారు. కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి డీఎల్ వచ్చారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇళ్లు, పించన్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన చాలా మందికి పథకాలు అందడం లేదన్నారు. జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన డీఎల్‌ను సభావేదికపైకి అధికారులు ఆహ్వానించినా ఆయన వెళ్లలేదు. జనంలోనే కూర్చుని సమస్యలపై నిలదీశారు.