అసదుద్దీన్‌కు ఐఎస్‌ఐఎస్ తీవ్ర వార్నింగ్

ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఐఎస్‌ఐఎస్‌పై మాట్లాడకుండా ఉంటే నీకే మంచిది అని ట్వీటర్‌లో అసద్‌ను హెచ్చరించారు ఉగ్రవాదులు. ఐఎస్‌ఐఎస్ గురించి తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. త్వరలోనే ఇండియాలో కూడా ఐఎస్‌ఐఎస్ విస్తరిస్తుందని ట్వీట్ చేశారు. ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే నరకానికి వెళ్తావ్ అని హెచ్చరించారు. ఐఎస్‌ఐఎస్ హెచ్చరికలపై ఓవైసీ స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎవరు నరకానికి వెళ్లాలి.. ఎవరు స్వర్గానికి వెళ్లాలి అన్నది అల్లాయే […]

Advertisement
Update:2016-01-07 04:12 IST

ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఐఎస్‌ఐఎస్‌పై మాట్లాడకుండా ఉంటే నీకే మంచిది అని ట్వీటర్‌లో అసద్‌ను హెచ్చరించారు ఉగ్రవాదులు. ఐఎస్‌ఐఎస్ గురించి తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. త్వరలోనే ఇండియాలో కూడా ఐఎస్‌ఐఎస్ విస్తరిస్తుందని ట్వీట్ చేశారు. ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే నరకానికి వెళ్తావ్ అని హెచ్చరించారు. ఐఎస్‌ఐఎస్ హెచ్చరికలపై ఓవైసీ స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎవరు నరకానికి వెళ్లాలి.. ఎవరు స్వర్గానికి వెళ్లాలి అన్నది అల్లాయే నిర్ణయిస్తారని చెప్పారు. దానిపై మాట్లాడే హక్కు ఐఎస్‌ఐఎస్‌కు లేదన్నారు. అయితే ఈ బెదిరింపులపై పోలీసులుకు ఫిర్యాదు చేసే ఆలోచన తనకు లేదన్నారు అసద్ .

Tags:    
Advertisement

Similar News