అపోలో ఆస్పత్రుల్లో ఐటీ దాడులు

వైద్య రంగంలో దేశంలోనే ప్రసిద్ధి గాంచిన అపోలో ఆస్పత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఐటీశాఖకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఏకకాలంలో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైలోని అపోలో ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించారు. ఆపోలో హాస్పిటల్స్ పై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా అపోలో హాస్పిటల్స్ కు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలతో పాటు చెన్నైలోని అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు […]

Advertisement
Update:2016-01-04 18:31 IST
వైద్య రంగంలో దేశంలోనే ప్రసిద్ధి గాంచిన అపోలో ఆస్పత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఐటీశాఖకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఏకకాలంలో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైలోని అపోలో ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించారు. ఆపోలో హాస్పిటల్స్ పై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా అపోలో హాస్పిటల్స్ కు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలతో పాటు చెన్నైలోని అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు.
ఏకకాలంలో అపోలోకి చెందిన అన్ని బ్రాంచిల్లో దాడులు జరిగాయి. చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని ప్రధాన ఆస్పత్రితోపాటు నగరంలోని అనేక శాఖల్లో సోదాలు నిర్వహించారు. ఆసుపత్రులకు సంబంధించిన పలు రికార్డులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. చెన్నైలోని పది శాఖల్లోనూ, దేశవ్యాప్తంగా 20 అపోలో ఆస్పత్రుల్లోనూ దాడులు నిర్వహించామని ఐటీ అధికారి వెల్లడించారు. ఈ దాడుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వైద్య రంగంలో ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరుగాంచిన అపోలో హాస్పిటల్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. అపోలో ఆస్పత్రులపై దాడుల నేపథ్యంలో మిగతా కార్పొరేట్ ఆస్పత్రులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.
Tags:    
Advertisement

Similar News