సీమ రాష్ట్రానికి మద్దతిస్తా!

లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై రాష్ట్రం సరిగా ఒత్తిడి తేవడం లేదని అభిప్రాయపడ్డారు. కనీసం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. ఆ దిశగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేల్చాలని సూచించారు. పక్క రాష్ట్రాలను సాకుగా చూపి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం తప్పించుకుంటోందని జేపీ విమర్శించారు. రాయలసీమ ప్రజలు కోరుకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు […]

Advertisement
Update:2015-12-27 06:40 IST

లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై రాష్ట్రం సరిగా ఒత్తిడి తేవడం లేదని అభిప్రాయపడ్డారు. కనీసం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. ఆ దిశగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేల్చాలని సూచించారు. పక్క రాష్ట్రాలను సాకుగా చూపి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం తప్పించుకుంటోందని జేపీ విమర్శించారు. రాయలసీమ ప్రజలు కోరుకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు తాను మద్దతిస్తానని చెప్పారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన సీమ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు.

Tags:    
Advertisement

Similar News