ఈ "లోఫర్" పని చేసిందెవరు?

అభిమానుల అత్యుత్సాహం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చికాకు పెడుతోంది. ఇటీవల గుంటూరులో జరిగిన ”లోఫర్” సినిమా పంక్షన్‌కు మెగా అభిమానులు మంత్రిని ఆహ్వానించారట. సినిమా వాళ్ల కార్యక్రమం కదా వెళ్తే మెగా అభిమానుల్లో తనపై క్రేజ్ పెరుగుతుందనుకున్న మంత్రి అందుకు ఓకే అన్నారని తెలుస్తోంది. నిర్వాహకులు ఘనంగా మంత్రికి స్వాగతం ఏర్పాట్లు చేశారు. ఏ లోటు రాకుండా చూసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఎంట్రీలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసిన మంత్రి అనుచరులకు ఏదో తేడా […]

Advertisement
Update:2015-12-22 18:48 IST

అభిమానుల అత్యుత్సాహం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చికాకు పెడుతోంది. ఇటీవల గుంటూరులో జరిగిన ”లోఫర్” సినిమా పంక్షన్‌కు మెగా అభిమానులు మంత్రిని ఆహ్వానించారట. సినిమా వాళ్ల కార్యక్రమం కదా వెళ్తే మెగా అభిమానుల్లో తనపై క్రేజ్ పెరుగుతుందనుకున్న మంత్రి అందుకు ఓకే అన్నారని తెలుస్తోంది. నిర్వాహకులు ఘనంగా మంత్రికి స్వాగతం ఏర్పాట్లు చేశారు. ఏ లోటు రాకుండా చూసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఎంట్రీలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసిన మంత్రి అనుచరులకు ఏదో తేడా కొట్టిందట. click to read: అచ్చెన్నాయుడును బూతులు తిట్టిన కొడాలి

తీక్షణంగా గమనించగా అందులో బండతప్పు బయటపడింది. అభిమానులు లోఫర్ సినిమా తరపున స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీపై ”వెల్‌కమ్‌ టూ లోఫర్ ప్రత్తిపాటి పుల్లారావుగారు” అని రాశారు. దీంతో మంత్రి అనుచరులకు దిమ్మతిరిగింది. దీంతో నాలుక కరుచుకున్న నిర్వాహకులు వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ అప్పటికే మంత్రిగారి ఫ్లెక్సీ సోషల్ మీడియాలోకి ఎక్కిపోయింది. మెరుపువేగంగా దూసుకెళ్లింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు మంత్రి వచ్చిన సమయంలోనూ ఇతర సభ్యులు పదేపదే ఆ ఫ్లెక్సీ సంగతి లేవనెత్తారట. ఫ్లెక్సీ అలా ఎలా పెడుతారండి అంటూ పదేపదే గుర్తు చేసి మంత్రిని చికాకు పెట్టారట. అయితే మంత్రిలాంటి ఉన్నతమైన వ్యక్తి వస్తున్న సమయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా కానీపక్షంలో ఆయనతోపాటు ఆయన హోదాను అవమానించడమే. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.

Tags:    
Advertisement

Similar News