సభ నుంచి విపక్షం సస్పెండ్, రంగంలోకి మార్షల్స్
కాల్‌మనీపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. జగన్‌తో సహా మొత్తం వైసీపీ సభ్యులపై వేటు వేశారు. అంబేద్కర్ -రాజ్యంగం అంశంపై చర్చ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభను వదిలిపెట్టి వెళ్లిపోవాలని స్పీకర్ పదేపదే సూచించారు. ఈ సమయంలో స్పీకర్ కోడెల తన సీటు నుంచి వెళ్లిపోగా ఆయన స్థానంలో ప్యానల్ స్పీకర్ విష్ణుకుమార్ […]
కాల్‌మనీపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. జగన్‌తో సహా మొత్తం వైసీపీ సభ్యులపై వేటు వేశారు. అంబేద్కర్ -రాజ్యంగం అంశంపై చర్చ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభను వదిలిపెట్టి వెళ్లిపోవాలని స్పీకర్ పదేపదే సూచించారు. ఈ సమయంలో స్పీకర్ కోడెల తన సీటు నుంచి వెళ్లిపోగా ఆయన స్థానంలో ప్యానల్ స్పీకర్ విష్ణుకుమార్ రాజు వచ్చారు. ఆయన మార్షల్స్‌ను పిలిచి, విపక్ష సభ్యులను బయటకు పంపాల్సిందిగా సూచించారు. మార్షల్ వచ్చి వైసీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లారు.