అసెంబ్లీలో కాల్‌మనీ మంటలు-సవాళ్లు ప్రతిసవాళ్లు

బెజవాడ  కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశం అసెంబ్లీని కుదిపేసింది. కాల్‌మనీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో వివాదం మొదలైంది. విజయవాడలో జరిగిన హేయమైన చర్యపై చర్చ జరగాల్సిందేనని వైసీపీ సభ్యలు పట్టుబడ్డారు.  కాల్‌ మనీ నిందితులతో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు దిగిన ఫోటోలను జగన్ ప్రదర్శించబోయారు. అయితే జగన్ మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. కాల్‌మనీ(cm) చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు.  కాల్‌మనీపై రేపు స్టేట్‌మెంట్ ఇస్తామని యనమల రామకృష్ణుడు చెప్పారు. అయినా […]

Advertisement
Update:2015-12-17 04:25 IST

బెజవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశం అసెంబ్లీని కుదిపేసింది. కాల్‌మనీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో వివాదం మొదలైంది. విజయవాడలో జరిగిన హేయమైన చర్యపై చర్చ జరగాల్సిందేనని వైసీపీ సభ్యలు పట్టుబడ్డారు. కాల్‌ మనీ నిందితులతో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు దిగిన ఫోటోలను జగన్ ప్రదర్శించబోయారు. అయితే జగన్ మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. కాల్‌మనీ(cm) చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాల్‌మనీపై రేపు స్టేట్‌మెంట్ ఇస్తామని యనమల రామకృష్ణుడు చెప్పారు. అయినా విపక్షం శాంతించలేదు. నినాదాలు కొనసాగించారు.

Click to Read: అసెంబ్లీలో మైక్ మేనేజ్‌మెంట్ అదరహో !

ఈ సమయంలోనే ప్రభుత్వ చీఫ్ విప్‌ కాల్వ శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్యచౌదరి వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్‌ నేర చరిత్రపైనా చర్చించాలని గోరంట్ల డిమాండ్ చేశారు. ఇంకో ప్రజాసమస్య లేదా అని ప్రశ్నించారు. కాల్‌మనీలో వైసీపీ నేతలు కూడా ఉన్నారని గోరంట్ల బుచ్చయ్య ఆరోపించారు. దొంగల ముఠా నాయకుడు జగన్‌ అని కాల్వ శ్రీనివాస్ విమర్శించారు. అలాంటి జగన్‌ చంద్రబాబును విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. కాల్‌మనీ నిందితుడు దూడ రమేష్ గతంలో జగన్‌తో కలిసి ఉన్న ఫోటోను టీడీపీ
సభ్యులు ప్రదర్శించారు. వైసీపీ సభ్యుల నినాదాలతో సభ అట్టుడకడంతో స్పీకర్‌ సభను తొలుత పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

Tags:    
Advertisement

Similar News