అసెంబ్లీలో మైక్ మేనేజ్‌మెంట్ అదరహో !

కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ విషయంలో ప్రతిపక్షంపై అధికారపక్షం పక్కా వ్యూహాత్యకంగా ఎదురుదాడి చేసినట్టు కనిపిస్తోంది. సభ ప్రారంభం కాగానే కాల్‌మనీ సెక్స్ రాకెట్ సభ్యులతో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు దిగిన ఫోటోలను జగన్‌ ప్రదర్శించబోయారు. దీంతో వెంటనే స్పీకర్ మైక్ కట్ చేశారు. వాయిదా తీర్మానం తిరస్కరించినందున కాల్‌మనీ అంశం గురించి మాట్లాడవద్దని కోరారు. అయితే ఇదే సమయంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం వరుసపెట్టి మాట్లాడారు. Click to Read: అసెంబ్లీలో కాల్‌మనీ మంటలు-సవాళ్లు ప్రతిసవాళ్లు click […]

Advertisement
Update:2015-12-17 05:07 IST

కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ విషయంలో ప్రతిపక్షంపై అధికారపక్షం పక్కా వ్యూహాత్యకంగా ఎదురుదాడి చేసినట్టు కనిపిస్తోంది. సభ ప్రారంభం కాగానే కాల్‌మనీ సెక్స్ రాకెట్ సభ్యులతో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు దిగిన ఫోటోలను జగన్‌ ప్రదర్శించబోయారు. దీంతో వెంటనే స్పీకర్ మైక్ కట్ చేశారు. వాయిదా తీర్మానం తిరస్కరించినందున కాల్‌మనీ అంశం గురించి మాట్లాడవద్దని కోరారు. అయితే ఇదే సమయంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం వరుసపెట్టి మాట్లాడారు.

Click to Read: అసెంబ్లీలో కాల్‌మనీ మంటలు-సవాళ్లు ప్రతిసవాళ్లు

click to read: అంబేద్కర్‌ సాయంతో గట్టెక్కిన ప్రభుత్వం

వైసీపీ సభ్యులు పోడియం ముందు అసెంబ్లీలో హోరెత్తేలా నినాదాలు చేస్తున్నా స్పీకర్‌ మాత్రం అధికార పక్ష సభ్యులకు వరుస పెట్టి మైక్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షంపై మంత్రులు యనమల, రావెల కిషోర్‌బాబు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు ఏకధాటిగా విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో అసెంబ్లీ తీరును గుర్తుకు చేసుకుంటే సభ ఆర్డర్‌లో లేని సమయంలో స్పీకర్లు ఏ ఒక్క సభ్యుడికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రతిపక్షం ఆందోళన చేస్తున్నా అధికార పక్ష సభ్యులకు విరివిగా మైక్ అందుతోంది.

Tags:    
Advertisement

Similar News