అంబేద్కర్ సాయంతో గట్టెక్కిన ప్రభుత్వం
తొలి రోజు ఏపీ అసెంబ్లీని కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశం కుదిపేసింది. అయితే ప్రభుత్వం చాకచక్యంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి అంశాన్ని తెరపైకి తెచ్చి విపక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. ఆ విషయంలో తొలిరోజు కొంత వరకు ప్రభుత్వం విజయం సాధించింది. అంబేద్కర్- రాజ్యాంగం అంశంపై చర్చకు వైసీపీ అడ్డుపడుతోందన్న భావన కలిగించడం ద్వారా ప్రతిపక్షానికి ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది. అయితే అంబేద్కర్ జయంతి నేడు కాదు… చాలా రోజుల క్రితమే జరిగింది. అయినా […]
తొలి రోజు ఏపీ అసెంబ్లీని కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశం కుదిపేసింది. అయితే ప్రభుత్వం చాకచక్యంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి అంశాన్ని తెరపైకి తెచ్చి విపక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. ఆ విషయంలో తొలిరోజు కొంత వరకు ప్రభుత్వం విజయం సాధించింది. అంబేద్కర్- రాజ్యాంగం అంశంపై చర్చకు వైసీపీ అడ్డుపడుతోందన్న భావన కలిగించడం ద్వారా ప్రతిపక్షానికి ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది. అయితే అంబేద్కర్ జయంతి నేడు కాదు… చాలా రోజుల క్రితమే జరిగింది. అయినా తొలిరోజు సభలో అంబేద్కర్ గురించి చర్చించాలంటూ అధికారపక్షం పట్టుబట్టింది. దీన్ని వ్యతిరేకిస్తే ప్రతిపక్షం దళితులకు వ్యతిరేకం అన్న భావన కలిగించాలన్న వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఇందులో భాగంగా దళిత ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్షంపై అధికార పక్షం పదేపదే దాడి చేయించింది. అయితే దారుణమైన కాల్‌మనీపై చర్చ జరగకుండా అంబేద్కర్ అంశాన్ని తెరపైకి తేవడం ఎంతవరకు సమంజమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో కాల్‌మనీ కేసు రచ్చ నుంచి బయటపడేందేందుకు తొలిరోజు అంబేద్కర్- రాజ్యాంగం అంశాన్ని అధికారపక్షం సమర్ధవంతంగానే ఉపయోగించుకుందన్న భావన వ్యక్తమవుతోంది.