రేపట్నుంచి సభా సమరం
వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 22వరకు సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ కేబినెట్ చర్చించింది. అటు ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ కూడా సభలో ఏం చేయాలన్నదానిపై వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. లోటస్ పాండ్ లో వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమై అసెంబ్లీ వ్యూహాలను సిద్ధం చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ […]
Advertisement
వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 22వరకు సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ కేబినెట్ చర్చించింది. అటు ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ కూడా సభలో ఏం చేయాలన్నదానిపై వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. లోటస్ పాండ్ లో వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమై అసెంబ్లీ వ్యూహాలను సిద్ధం చేశారు.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారంతోపాటు బాక్సైట్, ఇసుక అక్రమ తవ్వకాలు, రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాలపై ప్రతిపక్షం వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతల పాత్రలే ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వంపై వైసీపీ దాడి చేసేందుకు సిద్ధమైంది. దీంతోపాటు పోలవరం, పట్టిసీమసహా పలు ప్రాజెక్ట్ లతోపాటు వరద సహాయక చర్యల్లో లోపాలు, కరువు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు కూడా ప్రస్తావించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం కూడా ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఇసుక తవ్వకాలపై శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. అసెంబ్లీలోనే కొత్త విధానాన్ని ప్రకటించాలని భావిస్తోంది. కల్తీ మద్యం ఘటనపై వైసీపీని ఇరుకున పెట్టాలన్న ఆలోచనలో అధికారపక్షం ఉంది. కేబినెట్ సమావేశానికి కంటే ముందే చంద్రబాబు విజయవాడలో పార్టీ వ్యూహరచన కమిటీ సమావేశం నిర్వహించారు. మొత్తం మీద గురువారం నుంచి ఐదురోజుల పాటు జరిగబోయే అసెంబ్లీ సమావేశాలు ఈసారి కూడా వాడీ వేడీగా జరిగే అవకాశం ఉంది.
Advertisement