టీటీడీలో లడ్డూల దొంగలు

తిరుమల వెంకన్న సన్నిధిలో పనిచేసే ఉద్యోగులే ఆయన ఖజానాకు గండికొడుతున్నారు. ఈసారి లడ్డూ కుంభకోణం బయటకొచ్చింది. డోనర్ సెల్ లో పనిచేసే ఉద్యోగి వెంకట రమణ ఒక్క ఏడాదిలో 60వేల లడ్డూలు అక్రమంగా తీసుకున్నట్టు గుర్తించారు. మొదట ఈ విషయాన్ని పలువురు ఉద్యోగులు డిప్యూటీ ఈవో రాజేంద్రుడుకు సమాచారం ఇచ్చారు. దీనిపై నిఘా పెట్టిన డిప్యూటీ ఈవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వెంకట రమణ వ్యవహారంపై విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం లడ్డూ కుంభకోణానికి పాల్పడిన […]

Advertisement
Update:2015-12-15 07:34 IST
తిరుమల వెంకన్న సన్నిధిలో పనిచేసే ఉద్యోగులే ఆయన ఖజానాకు గండికొడుతున్నారు. ఈసారి లడ్డూ కుంభకోణం బయటకొచ్చింది. డోనర్ సెల్ లో పనిచేసే ఉద్యోగి వెంకట రమణ ఒక్క ఏడాదిలో 60వేల లడ్డూలు అక్రమంగా తీసుకున్నట్టు గుర్తించారు. మొదట ఈ విషయాన్ని పలువురు ఉద్యోగులు డిప్యూటీ ఈవో రాజేంద్రుడుకు సమాచారం ఇచ్చారు. దీనిపై నిఘా పెట్టిన డిప్యూటీ ఈవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వెంకట రమణ వ్యవహారంపై విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం లడ్డూ కుంభకోణానికి పాల్పడిన మాట వాస్తమేనని నిర్ధారించారు. దీంతో ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు టీటీడీ ఈవో ప్రకటించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇచ్చే దాతలు, భక్తులకు ప్రతిఏటా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను వారిచ్చిన అడ్రస్ లకు పంపుతూ ఉంటారు. ఇందుకోసం టీటీడీ ఒక డోనర్ సెల్ ను ఏర్పాటు చేసింది. ఇందులో పనిచేసే ఉద్యోగులే విరాళాలు ఇచ్చిన దాతలకు లడ్డూలు పంపాల్సి ఉంటుంది. అయితే ఇతను లడ్డూలను దాతలకు ఇవ్వకుండా ఏడాది కాలంగా 60వేలకు పైగా లడ్డూలను బ్లాక్ లో విక్రయించాడు. 25 రూపాయల ధర ఉండే లడ్డూను బ్లాక్ 40-50 రూపాయల వరకు విక్రయించే వాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు 30 లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్టు అంచనా. అయితే ఇంత పెద్దస్థాయిలో లడ్డూలు కాజేయడం కేవలం ఒక్క ఉద్యోగితోనే ఎలా సాధ్యం? ఈ కుంభకోణంలో ఇంకెవరెవరు ఉన్నారు? ఈ వ్యవహారంలో వెంకటరమణకు మరెవరైనా సహకరించారా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.
Tags:    
Advertisement

Similar News