కాల్ మనీ " బెజవాడ నేతల ఖండనల వెనుక అసలు కారణం!

కాల్ మనీ- సెక్స్ రాకెట్ బద్ధలవడంతో బెజవాడ నేతలు ఉలిక్కిపడ్డారు. ఈ దందా వెనుక అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మరికొన్ని పార్టీల నేతల హస్తం ఉందని మీడియాలో వరుసపెట్టి కథనాలురావడంతో నేతలంతా కంగారుపడ్డారు. మీడియాలో కథనాలు చూసిన తర్వాత జనం కూడా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అంటూ సొంతంగా లెక్కలేసుకోవడం ప్రారంభించారు. మిగిలిన పార్టీల నేతలంటే ఎవరై ఉంటారని చర్చించుకున్నారు. ఈ చర్చల్లో ఏ పాపం తెలియని కొందరు నేతల పేర్లు కూడా రావడంతో వారు అవాక్కయ్యారట. మౌనంగా ఉంటే తమకూ కాల్ మనీ దందాలో […]

Advertisement
Update:2015-12-14 04:44 IST

కాల్ మనీ- సెక్స్ రాకెట్ బద్ధలవడంతో బెజవాడ నేతలు ఉలిక్కిపడ్డారు. ఈ దందా వెనుక అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మరికొన్ని పార్టీల నేతల హస్తం ఉందని మీడియాలో వరుసపెట్టి కథనాలురావడంతో నేతలంతా కంగారుపడ్డారు. మీడియాలో కథనాలు చూసిన తర్వాత జనం కూడా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అంటూ సొంతంగా లెక్కలేసుకోవడం ప్రారంభించారు. మిగిలిన పార్టీల నేతలంటే ఎవరై ఉంటారని చర్చించుకున్నారు. ఈ చర్చల్లో ఏ పాపం తెలియని కొందరు నేతల పేర్లు కూడా రావడంతో వారు అవాక్కయ్యారట.

మౌనంగా ఉంటే తమకూ కాల్ మనీ దందాలో వాటా ఉందన్న ప్రచారం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని సదరు ఎమ్మెల్యేలు,నేతలు భావించారు. అందుకే వెంటనే మీడియా ముందుకు వచ్చి కాల్ దందాపై ధ్వజమెత్తారు. దీని వెనుక ఎంతటి వారున్నా సరే , తమ పార్టీవారైనా సరే కఠినంగా శిక్షించాలంటూ కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని అండగా తాముంటామని పిలుపునిచ్చారు. ఇలా చేయడం ద్వారా ఈ దందాలో తమ ప్రమేయం లేదని ప్రజలకు మేసేజ్ పంపించారు.

మిగిలిన పార్టీ నేతలు కూడా కాల్ మనీపై విరుచుకుపడి సొంతంగా శీల పరీక్ష చేసుకున్నారు. అదన్న మాట … కాల్ మనీ దందాను కృష్ణా జిల్లా నేతలు పోటీ పడి ఖండించడం వెనుక … ప్రజలకు జరిగిన అన్యాయంపై అవేదనతో పాటు తమ వైపు అనుమానాలు చూపులు మళ్లకుండా ముందు జాగ్రత్త కూడా దాగి ఉందని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News