బల్దియా ఎన్నికల్లో రాజాసింగ్ తిరుగుబావుటా!
తెలంగాణ బీజేపీలో నాయకత్వ పోరు ముదురుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ వర్గాల మధ్య వైరం రోజురోజుకు పెరుగుతోంది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరికి బల్దియా ఎన్నికలలో కమలనాథుల ఓట్లపై ప్రతికూల ప్రభావం చూపబోతుంది. కిషన్‌రెడ్డి వర్గం మొదటి నుంచి తమను దూరం పెడుతూనే ఉందని రాజాసింగ్ వర్గం ఆరోపిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో టికెట్ జారీ విషయంలోనూ మీనమేషాలు లెక్కించారని గుర్తు చేస్తున్నారు. చివరకు తన […]
Advertisement
తెలంగాణ బీజేపీలో నాయకత్వ పోరు ముదురుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ వర్గాల మధ్య వైరం రోజురోజుకు పెరుగుతోంది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరికి బల్దియా ఎన్నికలలో కమలనాథుల ఓట్లపై ప్రతికూల ప్రభావం చూపబోతుంది. కిషన్‌రెడ్డి వర్గం మొదటి నుంచి తమను దూరం పెడుతూనే ఉందని రాజాసింగ్ వర్గం ఆరోపిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో టికెట్ జారీ విషయంలోనూ మీనమేషాలు లెక్కించారని గుర్తు చేస్తున్నారు. చివరకు తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకూ సమాచారం ఇవ్వకపోవడంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అందుకే, కొంతకాలంగా అధిష్టానంపై అలిగి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.
ఎన్నికల్లో హిందూ మహాసభ అభ్యర్థులు!
సొంత నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు బీజేపీలో చేరుతుంటే కనీస సమాచారం ఇవ్వకపోవడం రాజాసింగ్ కోపానికి అసలు కారణం. దీనికితోడు బీఫ్ ఫెస్టివల్ సమయంలో రాజాసింగ్ తప్ప ఇతర బీజేపీ నేతలెవరూ స్పందించలేదు. పైగా హిందుత్వ కార్యక్రమాలను నిర్వహించడంలో పార్టీ విఫలమైందని ఆరోపిస్తున్నాడు. దీనికితోడు కిషన్‌రెడ్డి పదవి కాలం తీరిపోతే ఆ పదవికి అన్ని విధాలా రాజాసింగే అర్హుడన్న కారణంతోనే కిషన్‌రెడ్డి వర్గం తమకు పార్టీలో పొగబెడుతోందని అతని అనుచరులు ఆరోపిస్తున్నారు. పాతబస్తీలో హిందూ మహాసభ కార్యక్రమాలను రాజాసింగ్ చురుగ్గా నిర్వహిస్తారు. ఇదే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేసింది. తనను పట్టించుకోని పార్టీకి తానేంటో తెలియజెప్పాలన్న నిర్ణయంతో హిందూ మహాసభ నుంచి కొందరు అభ్యర్థులను గోషామహల్ నియోజకవర్గంతోపాటు తనకు పట్టున్న పాతబస్తీ ప్రాంతాల్లో బల్దియా ఎన్నికల్లో నిలబెట్టి తన బలాన్ని చాటాలనుకుంటున్నాడు రాజాసింగ్. అదే సమయంలో ఆయన పార్టీ మారే ఆలోచనలోనూ ఉండటం విశేషం. ఇప్పటికే టీఆర్ ఎస్, శివసేనలు తనతో చర్చలు జరిపిన విషయాన్ని రాజాసింగే స్వయంగా విలేకరులకు తెలపడం గమనార్హం. తాను నెలఖారువరకు ఎదురుచూస్తానని హిందుత్వ విషయంలో పార్టీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయకపోతే తన దారి తాను చూసుకుంటానని ఖరాఖండిగా చెబుతున్నాడు.
Advertisement