టీడీపీకి మరోషాక్.. రాజీనామా చేసిన మాజీ మంత్రి

తెలంగాణలో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , నేతలు పార్టీని వీడగా… ఇప్పుడు ఆ జాబితాలోకి మాజీ మంత్రి విజయరామరావు చేరారు. ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో పార్టీకార్యాలయానికి పంపారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. విజయరామారావు గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి. సీబీఐ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.  చాలాకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు […]

Advertisement
Update:2015-12-11 11:12 IST

తెలంగాణలో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , నేతలు పార్టీని వీడగా… ఇప్పుడు ఆ జాబితాలోకి మాజీ మంత్రి విజయరామరావు చేరారు. ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో పార్టీకార్యాలయానికి పంపారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. విజయరామారావు గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి. సీబీఐ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. చాలాకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Tags:    
Advertisement

Similar News