అధికారం కొత్తకాదు... నేను పుట్టినప్పుడే అన్నగారు సీఎం

విశాఖ జిల్లా చీడికాడలో జరిగిన జనచైతన్యయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి కార్యకర్తకు అండగా తానుంటానని చెప్పారు. త్వరలోనే నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తాను నిరంతరం కార్యకర్తల సంక్షేమం కోసమే కృషి చేస్తున్నానని అన్నారు. టీడీపీకి పత్రికగానీ, టీవీ చానల్‌ గానీ లేదని కాబట్టి కార్యకర్తలే ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. పేపర్ పెట్టి జైలుకు వెళ్లే ఆలోచన తనకు లేదన్నారు. […]

Advertisement
Update:2015-12-07 15:10 IST

విశాఖ జిల్లా చీడికాడలో జరిగిన జనచైతన్యయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి కార్యకర్తకు అండగా తానుంటానని చెప్పారు. త్వరలోనే నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తాను నిరంతరం కార్యకర్తల సంక్షేమం కోసమే కృషి చేస్తున్నానని అన్నారు.

టీడీపీకి పత్రికగానీ, టీవీ చానల్‌ గానీ లేదని కాబట్టి కార్యకర్తలే ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. పేపర్ పెట్టి జైలుకు వెళ్లే ఆలోచన తనకు లేదన్నారు. ఎన్టీఆర్‌ హయాంలోగానీ, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోగానీ తనపైనా, తన కుటుంబంపైనా ఒక్క ఆరోపణైనా వచ్చిందా అని ప్రశ్నించారు. తమకు అధికారం కొత్త కాదని చెప్పారు. తాను పుట్టినప్పటికే అన్నగారు(ఎన్టీఆర్‌) ముఖ్యమంత్రిగా ఉన్నారని లోకేష్‌ చెప్పారు. చిన్నచిన్న విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి పార్టీ కోసం కలిసికట్టుగా కృషి చేయాలని కార్యకర్తలకు లోకేష్ పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News