తెలంగాణలో పడకేసిన 'మున్సి'పాలన

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అధికారులు ఇష్టారీతన వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ వద్దే మున్సిపల్ శాఖ ఉండడం, ఆయన ఇప్పటికే తీవ్ర పనిభారంతో ఉండడంతో మున్సిపల్ శాఖపై దృష్టిసారించ లేకపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పురపాలకశాఖలోని ఉన్నతాధికారుల నుంచి జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లు కూడా ఆడింది ఆట.. పాడింది పాటలా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మున్సిపాలిటీలు ఉన్నాయి. అడిషనల్ డైరెక్టర్ స్థాయి నుంచి గ్రేడ్-1, స్పెషల్ గ్రేడ్ స్థాయి మున్సిపల్ కమిషనర్లను మున్సిపాలిటీలలో కమిషనర్లుగా నియమించాలి.  కానీ […]

Advertisement
Update:2015-12-04 10:50 IST
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అధికారులు ఇష్టారీతన వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ వద్దే మున్సిపల్ శాఖ ఉండడం, ఆయన ఇప్పటికే తీవ్ర పనిభారంతో ఉండడంతో మున్సిపల్ శాఖపై దృష్టిసారించ లేకపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పురపాలకశాఖలోని ఉన్నతాధికారుల నుంచి జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లు కూడా ఆడింది ఆట.. పాడింది పాటలా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మున్సిపాలిటీలు ఉన్నాయి. అడిషనల్ డైరెక్టర్ స్థాయి నుంచి గ్రేడ్-1, స్పెషల్ గ్రేడ్ స్థాయి మున్సిపల్ కమిషనర్లను మున్సిపాలిటీలలో కమిషనర్లుగా నియమించాలి.
కానీ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేనేజర్లను కమిషనర్లుగా నియమించారు. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఉన్నతాధికారుల్లో కమిషనర్ స్థాయి అధికారులు వున్నా వారికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో పాలన పూర్తిగా పడకేసింది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా పనిచేసిశ్రీనివాస్ అనే గ్రేడ్-1 కమిషనర్ అక్కడి ఎమ్మెల్యేతో విభేదాలు రావడంతో సెలవు పెట్టి వెళ్లిపోయారు. సెలవులు ఇటీవలే పూర్తయ్యాయి. సీడీఎంఏలో జాయిన్ అయ్యేందుకు వచ్చినా జాయిన్ చేసుకోలేదు. అడిషనల్ కమిషనర్ స్థాయికి చెందిన వందన్‌ కుమార్, నాగేశ్వర్‌కు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు.
ఇక హైదరాబాద్, వరంగల్ రీజినల్ డైరెక్టర్ పోస్టులలో వెయిటింగ్‌లో ఉన్న సీరియర్లను నియమించకుండా ఇంచార్జీలుగా ఇతర మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లను నియమించారు. వరంగల్ ఆర్‌జెడీగా రామగుండం కమిషనర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక హైదరాబాద్ ఆర్‌జేడీగా అదనపు బాధ్యతలను అడిషనల్ కమిషనర్ అనురాధకు ఇచ్చారు. మున్సిపల్ శాఖ సీఎం కేసీఆర్ పరిధిలోనే ఉన్నా.. ఆయన నిత్యం ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆశాఖలోని ఉన్నతాధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీలను గాడిలో పెట్టకపోతే రానున్న వర్షాకాలంలో రోగాలు విజృంభించే అవకాశం ఉంది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆశాఖపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Tags:    
Advertisement

Similar News