మెదక్ కోసం భాగ్యనగరికి నీళ్లు కట్
తెలుగుప్రజల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వేసవి రాకమునుపే శీతాకాలంలోనే మంచినీటికి కటకట మొదలయ్యింది. దాదాపు ఏభై ఏళ్ల తర్వాత సింగూరు, మంజీరా జలాల సరఫరా ఒకేసారి నిలిచిపోయింది. రాజధానిలో నవంబర్ నెలలో 57,672 ట్యాంకర్లు బుక్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నవంబర్ నెలలో ట్యాంకర్లు బుక్ చేసుకున్న వారిలో పదివేల మందికి పైగా ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. జలాశయాలు అడుగంటిపోవడంతో పాటు ఉన్న కాస్త నీటిని మెదక్ […]
Advertisement
తెలుగుప్రజల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వేసవి రాకమునుపే శీతాకాలంలోనే మంచినీటికి కటకట మొదలయ్యింది. దాదాపు ఏభై ఏళ్ల తర్వాత సింగూరు, మంజీరా జలాల సరఫరా ఒకేసారి నిలిచిపోయింది. రాజధానిలో నవంబర్ నెలలో 57,672 ట్యాంకర్లు బుక్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నవంబర్ నెలలో ట్యాంకర్లు బుక్ చేసుకున్న వారిలో పదివేల మందికి పైగా ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. జలాశయాలు అడుగంటిపోవడంతో పాటు ఉన్న కాస్త నీటిని మెదక్ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు నిల్వచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడం దీనికి కారణం. హైదరాబాద్‌కు 1965 నుంచి సింగూరు, మంజీరా జలాలు సరఫరా అవుతున్నాయి. కానీ ఈ జలాశయాల నుంచి నీటి సరఫరాలో కోత విధించాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయం భాగ్యనగర వాసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని జలమండలి అధికారులు చెబుతున్నారు. గోదావరి, కృష్ణా నీటిని మళ్లించి రాజధాని దాహార్తిని నివారిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
Advertisement