వరంగల్ ఫలితం క్రెడిట్ నాదే!
కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. జైపాల్ రెడ్డి డజనుకుపైగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేసినా ఇంత సీరియస్‌గా ఎన్నికల ప్రచారం చేసింది లేదు. అదే విషయాన్ని ఆయన వద్ద ఎవరైనా ప్రస్తావించి, “అంత సీరియస్‌గా వరంగల్ ఎన్నికల్లో మీరు తిరిగినా డిపాజిట్ రాలేదేం..’ అని ప్రశ్నిస్తే “డిపాజిట్ రాలేదు నిజమే… నేను ఆ […]
కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. జైపాల్ రెడ్డి డజనుకుపైగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేసినా ఇంత సీరియస్‌గా ఎన్నికల ప్రచారం చేసింది లేదు. అదే విషయాన్ని ఆయన వద్ద ఎవరైనా ప్రస్తావించి, “అంత సీరియస్‌గా వరంగల్ ఎన్నికల్లో మీరు తిరిగినా డిపాజిట్ రాలేదేం..’ అని ప్రశ్నిస్తే “డిపాజిట్ రాలేదు నిజమే… నేను ఆ మాత్రం ప్రచారం చేయబట్టే రెండో స్థానం దక్కింది” అని చెబుతున్నారు.
తాను ప్రచారం చేసి ఉండకపోతే కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానానికి వెళ్లేవాడని జైపాల్ రెడ్డి అంటున్నారట. ”ఇప్పటికీ కేసీఆర్ హవా నడుస్తోంది. జనం అతణ్నే నమ్ముతున్నారు. కానీ ప్రచారంలో నేను చెప్పిన మాటలు ప్రజల్లోకి దూసుకు వెళ్లాయి. ఇవాళ కాకపోయినా రేపైనా ఆలోచిస్తారు, ఓడిపోయినా నిరుత్సాహంలో ఉండిన మా కార్యకర్తలకు ఊపు నిచ్చింది” అని జైపాల్ ముక్తాయింపును ఇచ్చుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ మేధావిగా పేరున్న జైపాల్ వరంగల్ ఉప ఎన్నికల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకోవడం మాత్రం ఢిల్లీ స్థాయిలో కొద్ది రోజులు చర్చ నడిచింది.