డీఎస్‌కు మిగిలింది ఆ రెండే

సొంతూరు నష్టం… పక్క ఊరి లాభం రెండూ ఒకటే అంటారు. ఇప్పుడు డీఎస్‌ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని అలిగేసి దశబ్ధాలుగా కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని తెంచుకుని టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆహ్వాన మర్యాదలు అదిరిపోయినా ఆ తర్వాతే  గులాబీ దండు తీరు డీఎస్‌కు ఏ మాత్రం అంతుచిక్కడం లేదు. పార్టీలోకి రాగానే డీఎస్‌కు అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా నియమించారు. లక్ష రూపాయలు, కేబినెట్ హోదా కల్పించారు. అంతవరకు బాగానే ఉంది. బుగ్గకారు, దానిపై సైరన్ ఉన్నాయి కానీ  డీఎస్‌కు గౌరవించే వారే టీఆర్‌ఎస్‌లో […]

Advertisement
Update:2015-12-02 10:43 IST

సొంతూరు నష్టం… పక్క ఊరి లాభం రెండూ ఒకటే అంటారు. ఇప్పుడు డీఎస్‌ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని అలిగేసి దశబ్ధాలుగా కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని తెంచుకుని టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆహ్వాన మర్యాదలు అదిరిపోయినా ఆ తర్వాతే గులాబీ దండు తీరు డీఎస్‌కు ఏ మాత్రం అంతుచిక్కడం లేదు. పార్టీలోకి రాగానే డీఎస్‌కు అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా నియమించారు. లక్ష రూపాయలు, కేబినెట్ హోదా కల్పించారు. అంతవరకు బాగానే ఉంది. బుగ్గకారు, దానిపై సైరన్ ఉన్నాయి కానీ డీఎస్‌కు గౌరవించే వారే టీఆర్‌ఎస్‌లో కనిపించడం లేదు. దీంతో డీఎస్‌ మథనపడుతున్నారు.

ఏమీ లేకపోయినా కాంగ్రెస్‌లో తన పట్ల అపారమైన గౌరవం, ఆదరణ ఉండేదని .. సోనియా దగ్గరకు కూడా నేరుగా వెళ్లేవాడినని సన్నిహితుల దగ్గర డీఎస్‌ గత వైభవాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. ఒకప్పుడు సొంతజిల్లా కాంగ్రెస్‌పైనే కాదు, యావత్‌ కాంగ్రెస్‌ నేతలపై పెత్తనం చేశారు. ఇపుడది లేదు. సొంత జిల్లాలోనే ప్రభుత్వ బంట్రోతు కూడా తన మాట వినే పరిస్థితి కనిపించడం లేదు. అనవసరంగా టీఆర్‌ఎస్‌లోకి వచ్చి ఇరుక్కుపోయాను అని హితుల వద్ద వాపోతున్నారట.

తన హయాం ఎలాగూ గడిచింది. తన పుత్రుల రాజకీయ భవిష్యతైనా టీఆర్‌ఎస్‌లో వెదుక్కోవచ్చని భావించారాయన. ఆ కోరికను కూడా జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు (పాత శత్రువులు బాజిరెడ్డి గోవర్థన్‌, షిండే లాంటివారు) పడనీయడం లేదు. తాజాగా తన పుత్రుల్లో ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్‌ను డీఎస్‌ దేబిరిస్తున్నారట. ఆయన మాట కేసీఆర్‌ వింటారా లేదా అనేది వేచి చూడాలి. ఒక వేళ తన పుత్రుల భవిష్యత్తుకు కేసీఆర్‌ సహకరించకపోతే మళ్లీ ఢిల్లీ బాట పట్టి సొంతింటికి వెళతారా అనేది 2019 ఎన్నికల నాటి వరకూ వేచి చూడాల్సిన ప్రశ్న అని అంటున్నారు. ప్రస్తుతానికైతే డీఎస్‌కు మిగిలింది బుగ్గకారు, దానిపై సైరన్ మాత్రమే.

Tags:    
Advertisement

Similar News