ఆల్‌టైమ్ రికార్డు.. ఎకరం రూ. 29.28 కోట్లు
హైదరాబాద్‌లో భూముల ధరల రికార్డులు మరోసారి బద్ధలయ్యాయి. ఎకరం ఏకంగా 29 కోట్ల 88 లక్షలు పలికింది. రాయదుర్గం ప్రాంతంలోని భూములకు ప్రభుత్వం ఈ- వేలం నిర్వహించగా ఎకరాకు 29.88 కోట్లు వెచ్చించి అరబిందో ఫార్మా కంపెనీ ఐదు ఎకరాలను కొనుగోలు చేసింది. హైటెక్ సిటీకి సమీపంలోనే ఈ భూములున్నాయి.అదే ప్రాంతానికి సమీపంలో ఎకరాకు 24.88 కోట్లతో మరో మూడున్నర ఎకరాలకు అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. ప్రస్తుత ధర ఆల్ టైమ్ రికార్డు అని అధికారులు […]
హైదరాబాద్‌లో భూముల ధరల రికార్డులు మరోసారి బద్ధలయ్యాయి. ఎకరం ఏకంగా 29 కోట్ల 88 లక్షలు పలికింది. రాయదుర్గం ప్రాంతంలోని భూములకు ప్రభుత్వం ఈ- వేలం నిర్వహించగా ఎకరాకు 29.88 కోట్లు వెచ్చించి అరబిందో ఫార్మా కంపెనీ ఐదు ఎకరాలను కొనుగోలు చేసింది. హైటెక్ సిటీకి సమీపంలోనే ఈ భూములున్నాయి.అదే ప్రాంతానికి సమీపంలో ఎకరాకు 24.88 కోట్లతో మరో మూడున్నర ఎకరాలకు అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. ప్రస్తుత ధర ఆల్ టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. 2007-2008 మధ్య కాలంలో బూమ్ పీక్‌లో ఉన్న సమయంలోనూ 18 కోట్ల నుంచి 23 కోట్లకు మాత్రమే భూమి ధర పలికిందంటున్నారు.
నయ ఇన్‌ఫ్రా కంపెనీ రాయదుర్గం ప్రాంతంలోనే ఎకరం రూ. 24. 20 కోట్లకు రెండు ఎకరాలను సొంతం చేసుకుంది. మణికొండ, కోకాపేట్ ప్రాంతాల్లో భూములు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. అయితే కోకాపేటలో బహిరంగ మార్కెట్‌లో గజం ధర రూ. 40 వేలు ఉండగా ఇప్పుడు మాత్రం గజం 12500లకే అమ్ముడుపోయింది. ప్రస్తుత భూముల వేలం ద్వారా టీ ప్రభుత్వానికి రూ. 400 కోట్లు వచ్చాయి.