హైదరాబాద్ సిగలో అతిపెద్ద ట్విన్ టవర్స్
24 అంతస్తులు.. లక్ష సీసీ కెమెరాలు.. నిత్యం 400మంది పోలీసుల పర్యవేక్షణ, 600 కార్ల పార్కింగ్ స్పేస్. ఇదీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు. దేశంలోనే అతిపెద్ద పోలీస్ కంట్రోల్ రూమ్ గా ఇది రికార్డులకెక్కనుంది. బంజారాహిల్స్ రోడ్ 12లో ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ బిల్డింగ్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు జంటనగరాల్లో ఏర్పాటు చేయబోయే లక్ష […]
Advertisement
24 అంతస్తులు.. లక్ష సీసీ కెమెరాలు.. నిత్యం 400మంది పోలీసుల పర్యవేక్షణ, 600 కార్ల పార్కింగ్ స్పేస్. ఇదీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు. దేశంలోనే అతిపెద్ద పోలీస్ కంట్రోల్ రూమ్ గా ఇది రికార్డులకెక్కనుంది. బంజారాహిల్స్ రోడ్ 12లో ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ బిల్డింగ్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు జంటనగరాల్లో ఏర్పాటు చేయబోయే లక్ష సీసీ కెమెరాలను అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానం చేస్తారు. దీంతో నగరంలోని అంగుళం అంగుళం ఇక్కడి నుంచే పర్యవేక్షించే సౌకర్యం కలుగుతుంది. సింగపూర్, న్యూయార్క్ తర్వాత ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కమాండ్ సెంటర్ ఇదేనని ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్డింగ్ నిర్మాణానికి సుమారు 300 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా.
అద్దాలతో, మెరిసిపోయే డిజైన్‌తో రెండు ట్విన్ టవర్స్ నిర్మాణం జరగనుంది. 15కంపెనీలు ఇచ్చిన డిజైన్లు చూసిన ప్రభుత్వం ఒకదాన్ని ఫైనల్ చేసింది.ఒకదానిలో 16, మరోదానిలో 14 అంతస్తులు ఉంటాయి. రెండు టవర్ల మధ్య హైలెవల్ వంతెనతోపాటు టవర్లపై హెలిప్యాడ్, సోలార్ రూఫ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సోలార్ రూఫ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సందర్శకుల కోసం కింది భాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది. నాలుగో అంతస్తులో సీసీసీ ప్రధాన హాలు ఉంటుంది. దాదాపు వెయ్యి మంది కూర్చునే సామర్ధ్యంతో ఆడిటోరియం, భవనం చుట్టూ ల్యాండ్ స్కేప్‌లో వాటర్ ఫౌంటెన్‌లు ఏర్పాటు చేస్తారు.
ఇక నైరుతీ దిశగా 24అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. ఈశాన్య దిశగా 17అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. 17వ అంతస్తు దగ్గర రెండు టవర్‌లను కలుపుతూ మెగా సోలార్ రూఫ్, 18 వ అంతస్తు దగ్గర రెండు టవర్స్‌ను కలుపుతూ లింక్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు. 600కార్లు పార్కింగ్ చేసుకోనేలా మల్టి లెవల్ పార్కింగ్ విధానం ఉంటుంది. 6,7 ఫ్లోర్‌లలో సీఎం, హోంమంత్రి, సీఎస్, డీజీపీలు పర్యవేక్షించేలా ప్రత్యేక ఆఫీస్‌లు డిజైన్ చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరినట్టే.
Advertisement