హత్య చేయించబోయిన వినోద్‌కుమార్?

నటుడు వినోద్‌కుమార్ అరెస్ట్ అయ్యారు. తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలను చూసే మేనేజర్ సచ్చిదానందపై హత్యాయత్నం చేశారన్న ఆరోపణలపై వినోద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణలో సచ్చిదానంద పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అనుమానంతోనే దాడికి వినోద్ కుమార్ ప్రయత్నించారని ఆరోపణ. సహచరుడైన ఉదయ్ అనే వ్యక్తి ద్వారా వాహనంతో ఢీకొట్టి చంపాలని చూశారని, తనను హత్యచేసి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు  వినోద్ కుమార్ ప్రయత్నించారని సచ్చిదానంద ఆరోపిస్తున్నారు. సచ్చిదానంద పుత్తూరు పరిధిలోని సంప్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన […]

Advertisement
Update:2015-11-17 13:52 IST

నటుడు వినోద్‌కుమార్ అరెస్ట్ అయ్యారు. తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలను చూసే మేనేజర్ సచ్చిదానందపై హత్యాయత్నం చేశారన్న ఆరోపణలపై వినోద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణలో సచ్చిదానంద పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అనుమానంతోనే దాడికి వినోద్ కుమార్ ప్రయత్నించారని ఆరోపణ.

సహచరుడైన ఉదయ్ అనే వ్యక్తి ద్వారా వాహనంతో ఢీకొట్టి చంపాలని చూశారని, తనను హత్యచేసి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు వినోద్ కుమార్ ప్రయత్నించారని సచ్చిదానంద ఆరోపిస్తున్నారు. సచ్చిదానంద పుత్తూరు పరిధిలోని సంప్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు దాడికి యత్నించిన విషయం నిజమేనని నిర్దారించారు. దీంతో వినోద్‌కుమార్‌ను కర్ణాటకలోని ఆయన సొంత జిల్లా అయిన దక్షిణ కన్నడ ఈశ్వర మంగలలో పోలీసులు అరెస్టు చేశారు. వినోద్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్లు 120 బీ (నేరపూరిత కుట్ర), 307 (హత్యాయత్నం) కేసులు నమోదుచేశారు.

Tags:    
Advertisement

Similar News