కన్నా తండ్రి సైకిల్‌ షాపు, సీమలో కేసీఆర్ వారసులు

బీజేపీ నేతలతో పాటు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతున్న నాయకులపై మంత్రి రావెల కిషోర్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురివింద తన నలుపు ఎరుగదన్నట్టుగా బీజేపీ నేతల తీరుందని కావూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, కన్నా లక్ష్మినారాయణను ఉద్దేశించి విమర్శించారు. కన్నా లక్ష్మినారాయణ అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తాను చదువుకునే రోజుల్లో కన్నా లక్ష్మినారాయణ తండ్రి సైకిల్ షాపు పెట్టుకుని పంక్చర్లు వేసుకునేవారని రావెల చెప్పారు. అలాంటి వ్యక్తికి కొడుకైన కన్నా లక్ష్మినారాయణ ఇప్పుడు […]

Advertisement
Update:2015-11-05 18:41 IST

బీజేపీ నేతలతో పాటు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతున్న నాయకులపై మంత్రి రావెల కిషోర్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురివింద తన నలుపు ఎరుగదన్నట్టుగా బీజేపీ నేతల తీరుందని కావూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, కన్నా లక్ష్మినారాయణను ఉద్దేశించి విమర్శించారు. కన్నా లక్ష్మినారాయణ అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తాను చదువుకునే రోజుల్లో కన్నా లక్ష్మినారాయణ తండ్రి సైకిల్ షాపు పెట్టుకుని పంక్చర్లు వేసుకునేవారని రావెల చెప్పారు. అలాంటి వ్యక్తికి కొడుకైన కన్నా లక్ష్మినారాయణ ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.

రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబు కూడా అదే స్థాయికి ఎదిగారు కదా అని విలేకర్లు ప్రశ్నించగా చంద్రబాబు నిజాయితీగా సంపాదించారని చెప్పారు. తన ఆస్తుల వివరాలను చంద్రబాబు బహిర్గతం చేశారని కన్నా లక్ష్మినారాయణ ఆ పని చేయగలరా అని రావెల ప్రశ్నించారు. అయినా బీజేపీ నేతలు చేసే విమర్శలను తాము పార్టీ విమర్శలుగా చూడబోమన్నారు. అవన్ని బీజేపీ నేతలు వ్యక్తిగత అభిప్రాయాలతో చేస్తున్న ఆరోపణలేనని రావెల కిషోర్ బాబు చెప్పారు.

రాయలసీమ హక్కుల కోసం జేఏసీ ఏర్పాటు కాబోతోందన్న వార్తల నేపథ్యంలో రాయలసీమకు చెందిన నేతలపైనా రావెల విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ ప్రాంతాల మధ్య విధ్వేశాలను రెచ్చగొట్టారని ఇప్పుడు రాయలసీమలోనూ కేసీఆర్ వారసులు తయారవుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు మైసూరారెడ్డి ఏం చేశారని రావెల ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News