ఏపీకి కేంద్రం నిధులు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఏ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న పర్యాటక ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేసింది. ఇప్పటి వరకు ఆరునెలల కాలంలో కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. 2008లో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 14 టూరిజం ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో కాకినాడ బీచ్, అనంతపురం మెగా టూరిజం సర్క్యూట్, ఏటికొప్పాక, కూచిపూడిలాంటి రూరల్ టూరిజం […]

Advertisement
Update:2015-11-02 15:27 IST

ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఏ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న పర్యాటక ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేసింది. ఇప్పటి వరకు ఆరునెలల కాలంలో కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం విడుదల చేసింది.
2008లో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 14 టూరిజం ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో కాకినాడ బీచ్, అనంతపురం మెగా టూరిజం సర్క్యూట్, ఏటికొప్పాక, కూచిపూడిలాంటి రూరల్ టూరిజం ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేయాలంటే కేంద్రం నుంచి 135 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మాత్రం కేవలం 41కోట్ల 13లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేసింది.
యూపీఏ హయాంలో విజయనగరం-శ్రీకాకుళం టూరిజం డెవలప్ మెంట్ ప్రాజెక్టును 735లక్షలతో మొదలు పెట్టారు. దీనికి కేంద్రం నుంచి 2014లో 588లక్షలు మాత్రమే మంజూరు చేసింది. 2011లో చిత్తూరుజిల్లాలోనూ ఇలాంటి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 284లక్షలు అంచనా వేస్తే కేవలం 227 లక్షలు మాత్రమే విడుదల చేసింది. మౌళిక సదుపాయాలు కల్పించడం కోసం కేంద్రం 772లక్షలు అవుతాయని అంచనా వేస్తే కేంద్రం 618 లక్షలు విడుదల చేసింది.
2008 నుంచి అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం నిధులను నిలిపివేసింది.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలంటే రాష్ట్ర ఖజానా నుంచి నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఏపీలో ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పూర్తికాకుండా నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి కావాలంటే సుమారు 100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచానా.

Tags:    
Advertisement

Similar News