సోమేష్‌పై ఒంటికాలిపై లేచిన మర్రి శశిధర్‌రెడ్డి

కేసీఆర్‌, తలసానిలకు అధికార ప్రతినిధిగా వ్యవహరించి సనత్‌నగర్‌ నియోజకవర్గంలో 25 వేల ఓట్ల తొలగింపుకు కారణమైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ను బదిలీ చేసినంత మాత్రన వదిలి వేయబోమని, అతన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండు చేశారు. ఓట్ల తొలగింపులో కీలకపాత్ర పోషించిన సోమేష్‌ను పాతరేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. తన నియోజకవర్గంలో 25 వేల […]

Advertisement
Update:2015-10-31 15:29 IST

కేసీఆర్‌, తలసానిలకు అధికార ప్రతినిధిగా వ్యవహరించి సనత్‌నగర్‌ నియోజకవర్గంలో 25 వేల ఓట్ల తొలగింపుకు కారణమైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ను బదిలీ చేసినంత మాత్రన వదిలి వేయబోమని, అతన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండు చేశారు. ఓట్ల తొలగింపులో కీలకపాత్ర పోషించిన సోమేష్‌ను పాతరేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. తన నియోజకవర్గంలో 25 వేల ఓట్ల తొలగింపు దుర్మార్గమని శశిధర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తాను దొంగిలించానని, తన వద్ద ఉన్నాయని, దమ్ముంటే చర్యలు తీసుకోవాలని ఆయన సవాలు విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, తన మంత్రివర్గంలో ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్‌కు మేలు చేసే ఉద్దేశ్యంతోనే ఈ అక్రమానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఓట్ల తొలగింపు విషయం చెప్పినా ఆయన స్పందించక పోవడంతో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, ఓట్ల తొలగింపు అక్రమాలకు సంబంధించి సాక్ష్యాధారాలను కేంద్ర ఎన్నికల బృందానికి సమర్పించామని శశిధర్‌రెడ్డి తెలిపారు. కాగా సనత్‌నగర్‌లో ఓట్ల తొలగింపు ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం దర్యాప్తు నిర్వహించింది. ఈ సందర్భంగా మర్రి శశిధర్‌రెడ్డి ఓట్ల తొలగింపుకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలన్నీ ఎన్నికల సంఘం దర్యాప్తు అధికారులకు సమర్పించారు.

Tags:    
Advertisement

Similar News