హిప్నాటిజంతో రూ. 93వేలు స్వాహా!
ఓ హిప్నాటిస్ట్ తన ప్రతిభతో బ్యాంక్ మేనేజర్‌ను లొంగదీసుకుని రూ. 90 వేల రూపాయలు స్వాహా చేశాడు. తన తమ్ముడి పేరుతో అకౌంట్ ఓపెన్ చేయాలని బ్యాంకుకు వచ్చిన అతడు తన మాటలతో మేనేజర్ మణిరాంను హిప్నాటిజానికి గురి చేశాడు. దాంతో మేనేజర్ తన క్యాషియర్‌ను రూ. 90 వేలు తెమ్మని ఆదేశించాడు. ఆయన తెచ్చిన మొత్తానికి మరో మూడు వేలు కలిపి మణిరాం అతనికి ఇచ్చాడు. ఈ మొత్తాన్ని తీసుకున్న హిప్నాటిస్ట్ అక్కడి నుంచి చెక్కేశాడు. […]
ఓ హిప్నాటిస్ట్ తన ప్రతిభతో బ్యాంక్ మేనేజర్‌ను లొంగదీసుకుని రూ. 90 వేల రూపాయలు స్వాహా చేశాడు. తన తమ్ముడి పేరుతో అకౌంట్ ఓపెన్ చేయాలని బ్యాంకుకు వచ్చిన అతడు తన మాటలతో మేనేజర్ మణిరాంను హిప్నాటిజానికి గురి చేశాడు. దాంతో మేనేజర్ తన క్యాషియర్‌ను రూ. 90 వేలు తెమ్మని ఆదేశించాడు. ఆయన తెచ్చిన మొత్తానికి మరో మూడు వేలు కలిపి మణిరాం అతనికి ఇచ్చాడు. ఈ మొత్తాన్ని తీసుకున్న హిప్నాటిస్ట్ అక్కడి నుంచి చెక్కేశాడు. పది నిమిషాల్లో ఈ తతంగం అంతా అయిపోయింది. దాదర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హిప్నాటిజం నుంచి బయటపడిన మేనేజర్ మణిరాం జరిగింది తెలుసుకుని లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిప్నాటిస్ట్‌పై పోలీసులు 420 కేసు నమోదు చేశారు. బ్యాంక్‌కు వచ్చిన హిప్నాటిస్ట్ మేనేజర్‌తో తన పేరు ఎంకే శర్మగా పరిచయం చేసుకున్నాడు. సీసీటీవీ టేపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.