తలసానిపై మళ్లీ వాజ్యం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తిప్పలు తప్పడం లేదు. టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించి మంత్రిగా కొనసాగుతున్న తలసానిపై మరోసారి హైకోర్టులోప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. టీడీపీ తరపున గెలిచి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం రాజ్యంగ విరుద్ధమంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణను రెండు వారాలు వాయిదా వేసింది కోర్టు. తలసానితో పాటు పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇదివరకే […]

Advertisement
Update:2015-10-29 07:38 IST

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తిప్పలు తప్పడం లేదు. టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించి మంత్రిగా కొనసాగుతున్న తలసానిపై మరోసారి హైకోర్టులోప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. టీడీపీ తరపున గెలిచి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం రాజ్యంగ విరుద్ధమంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణను రెండు వారాలు వాయిదా వేసింది కోర్టు.

తలసానితో పాటు పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇదివరకే కాంగ్రెస్, టీడీపీలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ఆ విషయం స్పీకర్ పరిధిలో ఉందంటూ కోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో తలసాని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే ఆయనపై మరోసారి పిల్ దాఖలైంది.

Tags:    
Advertisement

Similar News