చోటా రాజన్‌కు రూ. 5 వేల కోట్ల ఆస్తులు!

చీకటి సామ్రాజ్యానికి అధిపతిగా చెలామణి అవుతున్న చోటా రాజన్‌కు వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు విచారణలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని తెలుస్తోంది. చైనా, ఇండోనేషియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, భారత్‌లో ఆయన వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడని తెలిసింది. చైనా, ఇండొనేషియాలో రాజన్‌కు హోటల్స్, థాయ్‌లాండ్, సింగపూర్‌లో జ్యుయెలరీ షాపులు ఉన్నాయి. ముంబయితోపాటు భారత్‌లోని అనేక ప్రాంతాల్లో రాజన్‌కు ఆస్తులున్నాయని నిఘా వర్గాల ద్వారా తెలిసింది. అలాగే జింబాబ్వేలో […]

Advertisement
Update:2015-10-29 18:17 IST

చీకటి సామ్రాజ్యానికి అధిపతిగా చెలామణి అవుతున్న చోటా రాజన్‌కు వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు విచారణలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని తెలుస్తోంది. చైనా, ఇండోనేషియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, భారత్‌లో ఆయన వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడని తెలిసింది. చైనా, ఇండొనేషియాలో రాజన్‌కు హోటల్స్, థాయ్‌లాండ్, సింగపూర్‌లో జ్యుయెలరీ షాపులు ఉన్నాయి. ముంబయితోపాటు భారత్‌లోని అనేక ప్రాంతాల్లో రాజన్‌కు ఆస్తులున్నాయని నిఘా వర్గాల ద్వారా తెలిసింది. అలాగే జింబాబ్వేలో ఆయన వజ్రాల వ్యాపారం చేస్తున్నట్టు కూడా తెలిసింది.
ఆరు గంటలపాటు విచారణ
మాఫియా డాన్ చోటారాజన్‌ను బాలి పోలీసులు ఆరు గంటలపాటు ఇంటరాగేట్ చేశారు. ఇండొనేషియాలో డ్రగ్స్ మాఫియాలో చోటారాజన్‌కు పాత్ర ఏమైనా ఉందా అని ఆరా తీశారు. మరోవైపు చోటారాజన్‌ను ఉంచిన జైలులో గదులు చూడటానికి అత్యంత దారుణంగా ఉన్నాయి. భద్రత ఏమాత్రం లేదు. సులభంగా దాడులు జరిగేందుకు అవకాశాలున్నాయి. ఇదే డాన్‌ రాజన్‌కు నిద్ర పట్టనివ్వడం లేదు. దావూద్ ఇబ్రహీం మనుషులు తనపై దాడి చేసే అవకాశాలున్నాయని, తగిన భద్రత కల్పించాలని రాజన్ బాలి పోలీసులను కోరారు. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియ జెప్పాలన్నారు. మరోవైపు చోటా రాజన్‌ను భారత్‌కు సురక్షితంగా తీసుకొచ్చి న్యాయస్థానంలో ప్రవేశపెట్టేందుకు అధికారులు బాలి వెళుతున్నారు.

Tags:    
Advertisement

Similar News