దేముడు మృతికి సిపియం సంతాపం
సిపిఐ సీనియర్ నాయకులు, గిరిజన ప్రాంత ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ జి.దేముడు మృతిచెందారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గిరిజన ప్రాంత ప్రజల సమస్యలపై ఆయన అశేషమైన కృషిని జరిపారు. గిరిపుత్రుల వాణిని అసెంబ్లీలో వినిపించడంలో కీలకమైన పాత్ర వహించారు. బాక్సైట్ త్రవ్వకాల వ్యతిరేకపోరాటంలో గిరిజనుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఉన్నత పదవుల్లో వున్నా ప్రజలతో మమేకమై సాధారణ జీవితాన్ని గడిపారు. ప్రజలకు సేవచేయాలనే దృక్పదంతో తమ ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని […]
సిపిఐ సీనియర్ నాయకులు, గిరిజన ప్రాంత ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ జి.దేముడు మృతిచెందారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గిరిజన ప్రాంత ప్రజల సమస్యలపై ఆయన అశేషమైన కృషిని జరిపారు. గిరిపుత్రుల వాణిని అసెంబ్లీలో వినిపించడంలో కీలకమైన పాత్ర వహించారు. బాక్సైట్ త్రవ్వకాల వ్యతిరేకపోరాటంలో గిరిజనుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఉన్నత పదవుల్లో వున్నా ప్రజలతో మమేకమై సాధారణ జీవితాన్ని గడిపారు. ప్రజలకు సేవచేయాలనే దృక్పదంతో తమ ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని ప్రజాసేవకు అంకితం అయ్యారు. జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డారు. గిరిజనులు కష్టాల్లో వున్నప్పుడు చేదోడువాదోడుగా వాళ్ళలో కలిసిపోయి పనిచేసే వ్యక్తిత్వం వున్న గొప్ప ప్రజల మనిషిగా దేముడు గుర్తింపు పొందారు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నా ప్రజాతంత్ర ఉద్యమాల్లో పట్టువదలకుండా పనిచేయడం వల్ల ఆయన నేటితరానికి ఆదర్శం.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై వామపక్షాలు మరింతగా కలిసికట్టుగా ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపిస్తున్న తరుణంలో దేముడు అకాలమరణం సిపిఐ పార్టీకి, వామపక్ష ఉద్యమానికి తీరనిలోటు అని, దేముడు ఆశయాల సాధన కోసం ముఖ్యంగా గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం కోసం, గిరిజన బ్రతుకులను సర్వనాశనం చేసే బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను విస్తృతపర్చడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళిగా సిపియం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీకి, ఆయన కుటుంబ సభ్యులకు ఫ్రగాడ సానుభూతిని తెలియజేశారు.