రేవంత్‌ను ఒంటరి చేస్తున్నదెవరు?
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తరువాత రేవంత్ – చంద్రబాబు మధ్య పెరిగిన సఖ్యత పాలపొంగేనా? పార్టీలో పెరిగిన ప్రాధాన్యం, అనూహ్యంగా సీనియర్ల అలక, ఆగ్రహాలు అంతా పథకం ప్రకారం జరుగుతున్నాయా? టీటీడీపీలో రేవంత్ ఒంటరవుతున్నాడా? పార్టీలో రేవంత్‌కు పొగ బెట్టడం మొదలైందా? అన్న విషయాలు ఇప్పుడు కేడర్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పరిణామాలు వ్యూహాత్మకమేనా.. ఓటుకు నోటు కేసులో వెలుగుచూసిన ఆడియో, వీడియో టేపులు తెలుగుదేశం పార్టీని, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని దేశ ప్రజల […]
Advertisement
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తరువాత రేవంత్ – చంద్రబాబు మధ్య పెరిగిన సఖ్యత పాలపొంగేనా? పార్టీలో పెరిగిన ప్రాధాన్యం, అనూహ్యంగా సీనియర్ల అలక, ఆగ్రహాలు అంతా పథకం ప్రకారం జరుగుతున్నాయా? టీటీడీపీలో రేవంత్ ఒంటరవుతున్నాడా? పార్టీలో రేవంత్‌కు పొగ బెట్టడం మొదలైందా? అన్న విషయాలు ఇప్పుడు కేడర్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
పరిణామాలు వ్యూహాత్మకమేనా..
ఓటుకు నోటు కేసులో వెలుగుచూసిన ఆడియో, వీడియో టేపులు తెలుగుదేశం పార్టీని, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని దేశ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాయి. ఈకేసుతో తమకు సంబంధం లేదని వారు ఎంత సమర్థించుకున్నా.. పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారన్న చెరగని మరక కలకాలం ఉండిపోతుంది. అప్పగించిన పనిని సవ్యంగా పూర్తి చేయకుండా అత్యుత్సాహంతో అందరినీ దోషులుగా నిలబడటానికి కారణం రేవంత్‌రెడ్డి దూకుడేనని పార్టీ సీనియర్లు, రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే అభివర్ణించారు. అవినీతి మరక పడ్డ నేతకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం వ్యూహాత్మకంగానే జరిగిందని ఇప్పుడు పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రాధాన్యం తగ్గించడం అందుకేనా..
కేసు సాగినంత కాలం చంద్రబాబు రేవంత్‌రెడ్డిని ఏమీ అనకూడదు. రేవంత్ అప్రూవర్‌గా మారితే ఇబ్బందే! అదే.. పార్టీలో వ్యతిరేకత పెరిగితే.. రేవంత్ తనంత తానుగా తప్పుకుంటాడు. ప్రాధాన్యం లేకపోతే.. పార్టీలో కార్యకర్తకు ఎమ్మెల్యేకు పెద్దగా తేడా ఉండదు. ఈ ప్రణాళిక అమలులో భాగంగానే.. పార్టీ నియమాలను పక్కన బెట్టి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉన్నత పదవి కట్ట బెట్టారని పలువురు అనుమానిస్తున్నారు. ఓవైపు రేవంత్‌కు మద్దతిస్తూనే.. మరోవైపు సీనియర్లతో పొగబెట్టించి.. రేవంత్ దూకుడు కళ్లెం వేసేలా పార్టీలో పావులు కదులుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రేవంత్‌ను ఒంటరి చేసి మూలకు కూర్చోబెడితే.. చంద్రబాబు చెప్పినట్లు వింటాడని వారు అనుమానిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. ప్రణాళికలో భాగంగానే.. రేవంత్‌పై సీనియర్లు ఒంటికాలితో లేస్తున్నారని, త్వరలోనే రేవంత్ ఒంటరవుతాడని భావిస్తున్నారు.
Advertisement