వరంగల్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 21న పోలింగ్

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈనెల 28న నోటిఫికేషన్ జారీకానుంది… నవంబర్ నాలుగు వరకు నామినేషన్లకు గడువు విధించారు. 5వ తేదీన స్క్రూట్నీ, 8 వరకు ఉపఎన్నికల అభ్యర్థుల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 21న వరంగల్ ఉపఎన్నికలు జరగనున్నాయి. 24వ తేదీన లెక్కింపు జరగనుంది. కడియం శ్రీహరి టీఆర్‌ఎస్ ఎంపీగా గెలుపొందిన అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దీంతో ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. […]

Advertisement
Update:2015-10-21 13:39 IST

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈనెల 28న నోటిఫికేషన్ జారీకానుంది… నవంబర్ నాలుగు వరకు నామినేషన్లకు గడువు విధించారు. 5వ తేదీన స్క్రూట్నీ, 8 వరకు ఉపఎన్నికల అభ్యర్థుల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 21న వరంగల్ ఉపఎన్నికలు జరగనున్నాయి. 24వ తేదీన లెక్కింపు జరగనుంది. కడియం శ్రీహరి టీఆర్‌ఎస్ ఎంపీగా గెలుపొందిన అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దీంతో ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఫలితంగా వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి-బిజెపి అభ్యర్థులతోపాటు వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ అధికార టీఆర్ఎస్‌ అభ్యర్ధితో పోటీ పడబోతున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత పి.కిష్టారెడ్డి మరణంతో ఏర్పడ్డ నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రం ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోవడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News