ఇండియన్ క్రికెటర్‌పై క్రిమినల్ కేసు
ఇండియా స్విన్ బౌలర్ అమిత్ మిశ్రా వివాదంలోనే కురుక్కున్నాడు. ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు అమిత్ మిశ్రాపై క్రిమినల్ కేసు నమోదుచేశారు. మరికొన్ని సెక్షన్లు జోడించారు. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అమిత్‌కు స్నేహితురాలైన సదరు ఫిర్యాదు చేసిన మహిళ చెబుతున్న దాని ప్రకారం సెప్టెంబర్ 25న అమిత్ బెంగళూరులోని ఓ హాటల్లో ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో ఫిర్యాదు చేసిన మహిళ అమిత్‌ను కలిసేందుకు అతడి గదికి వెళ్లింది. ఆ […]
ఇండియా స్విన్ బౌలర్ అమిత్ మిశ్రా వివాదంలోనే కురుక్కున్నాడు. ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు అమిత్ మిశ్రాపై క్రిమినల్ కేసు నమోదుచేశారు. మరికొన్ని సెక్షన్లు జోడించారు. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అమిత్‌కు స్నేహితురాలైన సదరు ఫిర్యాదు చేసిన మహిళ చెబుతున్న దాని ప్రకారం
సెప్టెంబర్ 25న అమిత్ బెంగళూరులోని ఓ హాటల్లో ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో ఫిర్యాదు చేసిన మహిళ అమిత్‌ను కలిసేందుకు అతడి గదికి వెళ్లింది. ఆ సమయంలోనే తనపై అమిత్ దాడి చేసి కొట్టాడని, వేధించాడంటూ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 354, 326 కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు హోటల్లో రికార్డయిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని డీసీపీ సందీప్ పాటిల్ చెప్పారు. విచారణకు వారంలోగా హాజరుకావాల్సిందిగా అమిత్ మిశ్రాకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఒక వేళ హాజరు కాకుంటే కఠిన చర్యలు తీసకుంటామని చెప్పారు.