ఏపీకి లక్ష కోట్ల ప్యాకేజీ రెడీ అట..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన రోజు ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రజలు తీపి కబురు చెప్పబోతున్నట్టు సమాచారం. 22న అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కి భారీ ప్యాకేజీ ప్రకటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీ ప్రత్యేక ప్యాకేజీని మోడీ ప్రకటించవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ప్రధాని నరేంద్రమోడీ పైనే […]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన రోజు ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రజలు తీపి కబురు చెప్పబోతున్నట్టు సమాచారం. 22న అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కి భారీ ప్యాకేజీ ప్రకటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీ ప్రత్యేక ప్యాకేజీని మోడీ ప్రకటించవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ప్రధాని నరేంద్రమోడీ పైనే ఉంది. ఆయన ఏపీకి ఎలాంటి హామీ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేంద్రం ఇప్పటికే ప్రత్యేక హోదా అసాధ్యమని.. దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ కోసం ఇటీవల కొందరు బలిదానాలు చేసినప్పుడే కేంద్రం ప్యాకేజీ ప్రకటించడానికి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈలోపే అమరావతి శంకుస్థాపన తేదీ ఖరారు కావడంతో ఆ కార్యక్రమాన్నే వేదికగా చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా సుమారు 50వేల కోట్ల రూపాయల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు ప్యాకేజీని మోడీ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరి మోడీ నిజంగానే రాజధాని శంకుస్థాపన రోజు ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతారా? లేక ఇలా వచ్చి.. అలా వెళ్తారా? అన్నది తేలాలంటే 22వ తేదీవరకు వెయిట్ చేయాల్సిందే.