"ఉబర్" కారు డ్రైవర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన అత్యాచారం కేసులో ఉబర్ క్యాబ్‌ డ్రైవర్ శివకుమార్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. శివకుమార్‌పై మోపిన అభియోగాలన్ని నిర్థారణ అయ్యాయని ప్రకటించింది. ఈనెల 23న శిక్ష ఖరారు చేయనున్నారు. 2014 డిసెంబర్ 5న ఢిల్లీలో 25 ఏళ్ల యువతిపై క్యాబ్ డ్రైవర్ శివకుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి క్యాబ్‌లో ఇంటికి వెళ్తున్నసమయంలో డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ రేప్ ఘటన దేశంలోనే కలకలం రేపింది. ఉబర్ క్యాబ్ సర్వీస్ […]

Advertisement
Update:2015-10-19 21:30 IST

దేశ వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన అత్యాచారం కేసులో ఉబర్ క్యాబ్‌ డ్రైవర్ శివకుమార్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. శివకుమార్‌పై మోపిన అభియోగాలన్ని నిర్థారణ అయ్యాయని ప్రకటించింది. ఈనెల 23న శిక్ష ఖరారు చేయనున్నారు. 2014 డిసెంబర్ 5న ఢిల్లీలో 25 ఏళ్ల యువతిపై క్యాబ్ డ్రైవర్ శివకుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

యువతి క్యాబ్‌లో ఇంటికి వెళ్తున్నసమయంలో డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ రేప్ ఘటన దేశంలోనే కలకలం రేపింది. ఉబర్ క్యాబ్ సర్వీస్ కొన్నిప్రాంతాల్లో నిషేధాన్ని కూడా చవిచూసింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పోలీసులు ఘటన జరిగిన రెండు రోజులకు మధురలో శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈకేసులో 44 మంది సాక్ష్యులను విచారించారు. బాధితురాలు కూడా రేపిస్ట్‌ను గుర్తించింది. దీంతో కోర్టు శివకుమార్‌ను దోషిగా తేల్చింది.

డ్రైవరు శివకుమార్ పై ఉత్తరప్రదేశ్‌లోనూ పలు క్రిమినల్ కేసులున్నారు. 2013లోనూ యూపీలో లైంగికదాడి, దోపిడీ కేసు ఇతడిపై నమోదైంది. ఈ కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన శివకుమార్ మరోసారి 25 ఏళ్ల యువతిపై లైంగిక దాడి చేశారు. అనేకమంది మహిళలను రేప్‌ చేసానని శివకుమార్‌ పోలీసుల విచారణలో తెలపడం విశేషం.

Tags:    
Advertisement

Similar News