ఇద్దరు పసి పిల్లల సజీవ దహనం

పాత కక్షలు నలుగురు ప్రాణాలను తీయడానికి ప్రయత్నించాయి. ఓ కుటుంబం నిద్రిస్తున్న వేళ ఇంటికే నిప్పు పెట్టారు కొంతమంది దుండగులు. ఈసంఘటనలో ఇద్దరు పసిపిల్లలు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో చాలా కాలం నుంచి రెండు కుటుంబాల మధ్య కలహాలున్నాయి. ప్రత్యర్థులు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న దుండగులు అదను చూసుకుని ఇంట్లో నిద్రస్తున్న వేళ వారుంటున్న ఇంటికే నిప్పు పెట్టారు.  జితేందర్ అనే […]

Advertisement
Update:2015-10-20 13:00 IST

పాత కక్షలు నలుగురు ప్రాణాలను తీయడానికి ప్రయత్నించాయి. ఓ కుటుంబం నిద్రిస్తున్న వేళ ఇంటికే నిప్పు పెట్టారు కొంతమంది దుండగులు. ఈసంఘటనలో ఇద్దరు పసిపిల్లలు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో చాలా కాలం నుంచి రెండు కుటుంబాల మధ్య కలహాలున్నాయి. ప్రత్యర్థులు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న దుండగులు అదను చూసుకుని ఇంట్లో నిద్రస్తున్న వేళ వారుంటున్న ఇంటికే నిప్పు పెట్టారు. జితేందర్ అనే దళిత వ్యక్తికి అగ్ర కులమైన ఠాకూర్ కమ్యూనిటీ వారికి కొద్ది రోజుల క్రితం వాగ్వాదం జరిగింది. గొడవను మనసులో ఉంచుకున్న ఠాకూర్ కమ్యూనిటీ వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు. జితేందర్, తన భార్య తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై జితేందర్ మాట్లాడుతూ… కిటికిలో నుంచి వారు ఇంట్లోకి పెట్రోల్ పోసిన సమయంలో ఆ వాసనకు తనకు మెలకువ వచ్చిందని, తన భార్యను నిద్ర లేపే లోపు పెట్రల్‌కు నిప్పు అంటుకుందని చెప్పారు. తన ఇద్దరు పిల్లలు వైభవ్(రెండున్నర సంవత్సరాలు), దివ్య(11 నెలలు) మంటల్లో కాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన జితేందర్‌కు, ఆయన భార్యకు ఐసీయులో పెట్టి చికిత్స చేస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. గ్రామంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags:    
Advertisement

Similar News