22న రాయలసీమకు చీకటి రోజా?
రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై రాయలసీమ నేతలు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు పాలన కొనసాగింపుగా ఉందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి శంకుస్థాపన రోజు రాయలసీమ ప్రజలకు ఒక చీకటి రోజుగా బైరెడ్డి అభివర్ణించారు. అమరావతి శంకుస్థాపనకు రాయలసీమవాసులెవరూ వెళ్లవద్దని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని పేరుతో చంద్రబాబు […]
రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై రాయలసీమ నేతలు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు పాలన కొనసాగింపుగా ఉందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి శంకుస్థాపన రోజు రాయలసీమ ప్రజలకు ఒక చీకటి రోజుగా బైరెడ్డి అభివర్ణించారు. అమరావతి శంకుస్థాపనకు రాయలసీమవాసులెవరూ వెళ్లవద్దని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని పేరుతో చంద్రబాబు లక్ష కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని బైరె్డ్డి ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఈ సొమ్ము చంద్రబాబు అత్తసొత్తా అని ప్రశ్నించారు. ఈ ఖర్చుపై హైకోర్టులో పిల్ వేస్తామన్నారు.