ఇన్సులిన్ డోస్ పెరిగితే...
పెరుగుతున్న షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవడానికి ఇన్సులిన్ డోస్ పెంచడం అనేది మధుమేహ బాధితులకు తప్పనిసరి. అయితే ఇన్సులిన్ డోస్ పెరుగుతున్న కొద్దీ దానివలన చెడు ఫలితాలు ఉంటాయనే భయం ఉంటుంది. అలాంటివారికి ఇది మంచి వార్తే. ఇన్సులిన్ డోస్ ఎంతపెరిగినా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండదని ఓ నూతన అధ్యయనంలో తేలింది. ఇతర సమస్యలు లేకున్నా, ఒక్క ఇన్సులిన్ పెరుగుద లే గుండెకు హాని చేసి, మరణాన్ని తెచ్చిపెడుతుందనే భయం అక్కర్లేదని ఈ […]
పెరుగుతున్న షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవడానికి ఇన్సులిన్ డోస్ పెంచడం అనేది మధుమేహ బాధితులకు తప్పనిసరి. అయితే ఇన్సులిన్ డోస్ పెరుగుతున్న కొద్దీ దానివలన చెడు ఫలితాలు ఉంటాయనే భయం ఉంటుంది. అలాంటివారికి ఇది మంచి వార్తే. ఇన్సులిన్ డోస్ ఎంతపెరిగినా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండదని ఓ నూతన అధ్యయనంలో తేలింది.
ఇతర సమస్యలు లేకున్నా, ఒక్క ఇన్సులిన్ పెరుగుద లే గుండెకు హాని చేసి, మరణాన్ని తెచ్చిపెడుతుందనే భయం అక్కర్లేదని ఈ అధ్యయన వేత్తలు చెబుతున్నారు. అమెరికా, ఫిలడెల్ఫియాలో టెంపుల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత తమకు అందిన అధ్యయన వివరాలను, ఇన్సులిన్ వాడకాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిశీలించారు. ఇలా చూసినపుడు ఒక్కో యూనిట్ ఇన్సులిన్, ఒక్కో కేజీ శరీరబరువు పెరుగుతున్నపుడు గుండె వ్యాధులతో మరణం బారిన పడే ప్రమాదం 83 నుండి 236శాతం వరకు పెరిగినట్టుగా కనుగొన్నామని ఈ అధ్యయన నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించిన సిరాజ్ తెలిపారు.
తరువాత ఇన్సులిన్ డోస్ పెరుగుదలతో పాటు, దాన్ని ఉపయోగించడానికి కారణమైన ఇతర అంశాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తమ వద్ద ఉన్న డాటాని శాస్త్రవేత్తలు పరిశీలించారు. దాంతో ఇన్సులిన్ డోస్ గుండెసంబంధిత మరణాలకు కారణం కాదని తేలిందని సిరాజ్ పేర్కొన్నారు. యాక్షన్ టు కంట్రోల్ కార్డియోవాస్క్యులర్ రిస్క్ ఇన్ డయాబెటిస్ అనే పేరుతో నిర్వహించిన అధ్యయనం తాలూకూ డాటాని విశ్లేషించి ఈ ఫలితాన్ని తేల్చారు. ఈ పలితం మధుమేహ బాధితులకు ఆనందాన్నిచ్చేదే అయినా ఇన్సులిన్ డోస్ పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యపరంగా రిస్క్ పెరుగుతుందనే చర్చలకు ఈ అధ్యయ నం ముగింపు కాదని దీని నిర్వాహకులు అంటున్నారు. ఇన్సులిన్ డోస్ పెరుగుదల…అనుబంధ ఆరోగ్య సమస్యలపై ఇంకా సమాధానం తేలని ప్రశ్నలు చాలా ఉన్నాయని, వాటికి సమాధానాలు వెతకాల్సి ఉందని సిరాజ్ తెలిపారు.