రియల్ ఎస్టేట్ పంచాయతీలో ఇద్దరు ఎస్సైల అరెస్ట్
ఓ రియల్ ఎస్టేట్ దందాలో తలదూర్చి రెండు కోట్లు వసూలు చేయడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వారిద్దరినీ అరెస్ట్ కూడా చేసి విచారణ జరుపుతున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో జోక్యం చేసుకుని ఆయనను రివాల్వర్‌లతో బెదిరించారు. దీంతో శ్రీనివాసరావు పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరిపిన ఆల్వాల్ పోలీసులు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ పోలీస్ […]
ఓ రియల్ ఎస్టేట్ దందాలో తలదూర్చి రెండు కోట్లు వసూలు చేయడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వారిద్దరినీ అరెస్ట్ కూడా చేసి విచారణ జరుపుతున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో జోక్యం చేసుకుని ఆయనను రివాల్వర్‌లతో బెదిరించారు. దీంతో శ్రీనివాసరావు పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరిపిన ఆల్వాల్ పోలీసులు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రతాపలింగం, మెదక్ రూరల్ ఎస్సైలను అరెస్ట్ చేశారు. వీరిద్దరి వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిని సస్పెండ్ చేశారు. ఈ ఎస్సైలతోపాటు మరో ఇద్దరిని కూడా ఈ రియల్ దందాలో జోక్యం చేసుకున్నందుకు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ కేసుల్లో, రియల్ దందాల్లో ఇటీవల కాలంలో పోలీసుల జోక్యం ఎక్కువవుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన.