డిగ్గీ రాజాకు వినతుల స్వాగతం!
కొత్త పెళ్లికొడుకు అదేనండీ..! మన డిగ్గీ రాజా అలియాస్ దిగ్విజయ్ సింగ్ ఈనెల 19న తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న ఆయన పర్యటనకు కాంగ్రెస్ నేతలంతా సిద్ధంగా ఉన్నారంట. రాష్ట్రంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అన్న విషయంపై తమ తమ ఆలోచనలను డిగ్గీరాజా ముందు ఉంచనున్నారట. గ్రేటర్ ఎన్నికలలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నది డిగ్గీతో జరిగే భేటీలో కీలకాంశమని చెబుతున్నారు. ఇప్పటికే రైతు భరోసా యాత్రలతో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను […]
Advertisement
కొత్త పెళ్లికొడుకు అదేనండీ..! మన డిగ్గీ రాజా అలియాస్ దిగ్విజయ్ సింగ్ ఈనెల 19న తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న ఆయన పర్యటనకు కాంగ్రెస్ నేతలంతా సిద్ధంగా ఉన్నారంట. రాష్ట్రంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అన్న విషయంపై తమ తమ ఆలోచనలను డిగ్గీరాజా ముందు ఉంచనున్నారట. గ్రేటర్ ఎన్నికలలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నది డిగ్గీతో జరిగే భేటీలో కీలకాంశమని చెబుతున్నారు. ఇప్పటికే రైతు భరోసా యాత్రలతో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు తమ హయాంలో మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్చడంపైనా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థి టీడీపీతో కలిసి రాష్ట్ర బంద్ కూడా చేపట్టారు. ప్రతిపక్షం క్రియాశీలకంగా ఉందని, కాంగ్రెస్‌కు ప్రజాబలం పెరుగుతోందని డిగ్గీకి వివరించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ సిద్ధమవుతున్నారు.
ప్రసన్నం చేసుకునేందుకు నేతల యత్నాలు!
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి డిగ్గీని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ నేతలు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలన్న పట్టుదలతో ఎవరికివారు డిగ్గీని ప్రసన్నం చేసుకోవాలని ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. గ్రేటర్ కమిటీ విభజనకు సంబంధించి కూడా దిగ్విజయ్ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్న నేపథ్యంలో కీలక పదవులు దక్కించుకోవాలని నాయకులంతా ఆశపడుతున్నారు. ఈనెల 21న గాంధీభవన్‌లో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో డిగ్గీ పాల్గొంటారు. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ స్థానాల్లో పోటీకి ఇంతవరకూ ఏ నేతా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. మరోవైపు 20న వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతులతో సమావేశం అవుతారు. దీంతో వరంగల్, కరీంనగర్ డీసీసీ నేతలు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
కొందరిపై చర్చ!
కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీలోకి మారనున్నారన్న ప్రచారంపైనా డిగ్గీ ఆరా తీయనున్నట్లు సమాచారం. అలాగే, వరంగల్ సభలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలపైనా చర్చ జరగనుందని సమాచారం. పార్టీకి నష్టం చేకూర్చే ఇలాంటి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా ఉందన్న సంకేతాలు ఇవ్వనున్నారని తెలిసింది.
Advertisement