రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: కోదండరామ్
రైతుల సమస్యలపైన, ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలపైన విపక్ష పార్టీలు చేస్తున్న ఉద్యమానికి పరోక్షంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా మాట కలిపారు. ప్రభుత్వ ఉదాసీనతపై, రైతుల సమస్యల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విమర్శలను సంధించారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం గుంభనంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పు పట్టారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించడంతోపాటు వారికి ఆర్థికంగా చేయూతను ఇవ్వాలని డిమాండు చేశారు. గ్రామాల్లో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు తరాజ్ […]
రైతుల సమస్యలపైన, ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలపైన విపక్ష పార్టీలు చేస్తున్న ఉద్యమానికి పరోక్షంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా మాట కలిపారు. ప్రభుత్వ ఉదాసీనతపై, రైతుల సమస్యల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విమర్శలను సంధించారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం గుంభనంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పు పట్టారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించడంతోపాటు వారికి ఆర్థికంగా చేయూతను ఇవ్వాలని డిమాండు చేశారు. గ్రామాల్లో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు తరాజ్ అభియాన్‌తో రైతు సంవేదన యాత్రలో తాను పాల్గొన్నానని, వారి కష్టాలను స్వయంగా చూశానని కోదండరామ్ తెలిపారు. రైతు సంక్షేమం ప్రభుత్వాల ప్రథమ బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడో నిధులు సమకూరిన తర్వాత సాయం చేయడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుందని, ఆశించిన ప్రయోజనం కూడా నెరవేరదని ఆయన అన్నారు. తక్షణం కరువు మండలాలను ప్రకటించాలని, కేంద్ర సాయం పొందడానికి వీలుగా కరువు పరిస్థితిపై నివేదిక పంపాలని ఆయన సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించి వెంటనే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.