రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించిన దాడుల్లో అనూహ్యంగా పది కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు లభించియి. ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో వీరికి అనూహ్యంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ఓ నైజీరియన్ తారసపడ్డాడు. వీరి దాడుల్లో ఈ నైజీరియన్ ఇంటిలో నిల్వ ఉన్న రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న జాన్ దాబ్రి […]
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించిన దాడుల్లో అనూహ్యంగా పది కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు లభించియి. ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో వీరికి అనూహ్యంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ఓ నైజీరియన్ తారసపడ్డాడు. వీరి దాడుల్లో ఈ నైజీరియన్ ఇంటిలో నిల్వ ఉన్న రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న జాన్ దాబ్రి అనే ఈ నైజీరియన్‌ను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ కేంద్రంగా జాన్ దాబ్రి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు తెలుసుకుని అతన్ని పీటీ వారెంట్ పై హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement