రెండోరోజుకు చేరిన జగన్‌ నిరాహారదీక్ష

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న జగన్‌ను పలువురు పరామర్శిస్తున్నారు. ప్రత్యేక హోదాపైనే నవ్యాంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని అందుకోసం హోదా సాధించే వరకు దీక్షను ఆపే ప్రసక్తే లేదని జగన్‌ చెప్పారు. కాగా జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు. ఇదిలావుండగా జగన్ దీక్షపై […]

Advertisement
Update:2015-10-08 10:36 IST

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న జగన్‌ను పలువురు పరామర్శిస్తున్నారు. ప్రత్యేక హోదాపైనే నవ్యాంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని అందుకోసం హోదా సాధించే వరకు దీక్షను ఆపే ప్రసక్తే లేదని జగన్‌ చెప్పారు. కాగా జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు. ఇదిలావుండగా జగన్ దీక్షపై టీడీపీ నేతల విమర్శలు సరికాదని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని చూస్తోందని ఆరోపించారు. జగన్ ప్రత్యేకహోదా కోసం దీక్ష చేయడం తప్పు కాదని అన్నారు. ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యతను ఓ ప్రతిపక్ష నాయకుడు చేస్తుంటే సంతోషించి మద్దతివ్వాల్సింది పోయి విమర్శలు చేస్తూ ఆయన్ని అణగదొక్కే చర్యలకు పాల్పడడం శోచనీయమని ఆయన మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News