తెలుగుజాతి అభ్యున్నతికే ఎన్డీయేతో పొత్తు: చంద్రబాబు
ఇప్పుడు కూడా తెలుగువారి భవిష్యత్ కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామని, ఇపుడు జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ రూపొందినందున దేశంలో బహుముఖ పాత్ర పోషించాల్సిన అవసరం తమకు ఉంటుందని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మాట్లాడుతూ కొత్త, పాత కలయికతో పార్టీ కమిటీలను రూపొందించామని, రాబోయే రెండున్నర యేళ్ళలో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నాయకులకు, కార్యకర్తలకు […]
Advertisement
ఇప్పుడు కూడా తెలుగువారి భవిష్యత్ కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామని, ఇపుడు జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ రూపొందినందున దేశంలో బహుముఖ పాత్ర పోషించాల్సిన అవసరం తమకు ఉంటుందని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మాట్లాడుతూ కొత్త, పాత కలయికతో పార్టీ కమిటీలను రూపొందించామని, రాబోయే రెండున్నర యేళ్ళలో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నాయకులకు, కార్యకర్తలకు ఉందని చంద్రబాబు కోరారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేవరకు పోరాడాలని, ఆంధ్రప్రదేశ్‌లో కుచ్చిత రాజకీయాలు చేసే వారిని నిలువరించడంతోపాటు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేట్టు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు.
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉందని, అలాగే కార్యకర్తలు కూడా పార్టీని గెలిపించి తమకు పదవులు కట్టబెట్టారని ఈ విషయాన్ని మరిచిపోకుండా వారికి మేలు చేసేందుకు నాయకులు ప్రయత్నించాలని పిలుపు ఇచ్చారు. తెలుగుజాతి గౌరవం కోసం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, తెలుగువారి అభ్యున్నతికి ఆయన ఎంతో శ్రమించారని, ఆయనను జాతి చిరస్థాయిగా గుర్తుంచుకుంటుందని అన్నారు. గత మూడు దశాబ్దాల నుంచి తాము ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని చంద్రబాబు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్యకర్తలు తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడాలన్న లక్ష్యంతో పని చేస్తూ పార్టీకి మంచి పేరు తేవాలని ఆయన కోరారు. పార్టీ గురించి కష్టపడే వారిని తామెప్పుడూ విస్మరించలేదని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మందికి క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పారు.
Advertisement