ఎంపీ తోట నర్సింహంపై పడ్డ సైబర్ కేటుగాళ్లు

కాకినాడ ఎంపీ తోట నర్సింహం సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. సామాన్యులను నిత్యం మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు ఎంపీగారిని వదిలిపెట్టలేదు. తోట నర్సింహం డెబిట్ కార్డు నుంచి క్లోనింగ్ ద్వారా రూ. 50వేలు కాజేశారు. అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయినట్టు సెల్‌ఫోన్‌కు మేసేజ్ రావడంతో తోట నర్సింహం అవాక్కయ్యారు. వెంటనే బ్యాంకు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి అకౌంట్ నుంచి లావాదేవీలను నిలిపివేయించారు. ఆ సమయంలో ఎంపీ ఖాతాలో రూ 13 లక్షలున్నాయి. అనంతరం సీఐడీ పోలీసులకు తోట […]

Advertisement
Update:2015-10-03 04:11 IST

కాకినాడ ఎంపీ తోట నర్సింహం సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. సామాన్యులను నిత్యం మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు ఎంపీగారిని వదిలిపెట్టలేదు.

తోట నర్సింహం డెబిట్ కార్డు నుంచి క్లోనింగ్ ద్వారా రూ. 50వేలు కాజేశారు. అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయినట్టు సెల్‌ఫోన్‌కు మేసేజ్ రావడంతో తోట నర్సింహం అవాక్కయ్యారు. వెంటనే బ్యాంకు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి అకౌంట్ నుంచి లావాదేవీలను నిలిపివేయించారు. ఆ సమయంలో ఎంపీ ఖాతాలో రూ 13 లక్షలున్నాయి. అనంతరం సీఐడీ పోలీసులకు తోట ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో సైబర్ నేరగాళ్లు గోవాలోని ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు తేలింది. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో ఎంపీ షాపింగ్ చేశారు. అక్కడే తన కార్డుకు సంబంధించిన వివరాలను క్లోనింగ్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News