టీ కేబినెట్‌ నుంచి ముగ్గురు అవుట్?

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా కేసీఆర్ తీసుకెళ్లారని సమాచారం. కేబినెట్ నుంచి తొలగించబడే వారిలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కొన్ని అనివార్యకారణాల వల్ల విధులు సరిగా నిర్వర్తించలేకపోతున్నారు. ఆయనకు పని ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కేబినెట్ నుంచి తొలగిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి పదవి కూడా […]

Advertisement
Update:2015-10-02 10:54 IST

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా కేసీఆర్ తీసుకెళ్లారని సమాచారం. కేబినెట్ నుంచి తొలగించబడే వారిలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కొన్ని అనివార్యకారణాల వల్ల విధులు సరిగా నిర్వర్తించలేకపోతున్నారు. ఆయనకు పని ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కేబినెట్ నుంచి తొలగిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి పదవి కూడా తొలగించే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌కు చెందిన ఓ మంత్రి పదవికి ఎసరు రాబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి స్థానంలో ఎవరికి పదవులు దక్కుతాయన్న దానిపైనా నేతలు కొద్దివరకు స్పష్టత ఇస్తున్నారు.

వరంగల్ జిల్లా నుంచి వినయ్‌ భాష్కర్ లేదా కొండా సురేఖకు అవకాశం దక్కవచ్చు. అయితే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు మాత్రం వినయ్‌భాస్కర్‌కే పదవి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కొండా సురేఖ కూడా అంతే స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అలా వీలు కానిపక్షంలో భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవైనా తప్పనిసరిగా ఇవ్వాలని ఆమె కోరుతున్నారట.

ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖాళీ అయ్యే స్థానాన్ని కోవ లక్ష్మితో భర్తీ చేస్తారని తెలుస్తోంది. అలా చేయడం ద్వారా మహిళలకు కేబినెట్‌లో చోటు కల్పించినట్టు అవుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే హైదరాబాద్ నుంచి తొలగించే మంత్రిని బట్టి ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించే సూచనలు ఉన్నాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేబినెట్ బెర్త్ దక్కవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సమీకరణాలన్నీ ఆఖరి నిమిషంలో మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నేతలు.

Tags:    
Advertisement

Similar News