వీడియో తీసుకుని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌!

పాఠ‌శాల‌లో తోటి విద్యార్థుల‌ ముందు నిల‌బెట్టార‌న్న‌ అవ‌మానంతో ఓ విద్యార్థి రైలు కింద‌ప‌డి ప్రాణాలు తీసుకున్నాడు. చ‌నిపోయే ముందు తాను ఎందుకు చ‌నిపోతున్నానో వివ‌రిస్తూ.. ఓ వీడియో కూడా తీసుకున్నాడు. క‌రీంన‌గ‌ర్ జిల్లా పెద్ద‌ప‌ల్లి రైల్వేట్రాక్‌పై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాలు.. క‌రీంన‌గ‌ర్ జిల్లా అబ్బాపురానికి చెందిన శ్రీ‌నివాస‌రెడ్డి- అంజ‌లి దంప‌తుల‌కు ముగ్గురు సంతానం. వీరిలో సంతోష్‌రెడ్డి చిన్న‌వాడు. ప‌క్క‌నే ఉన్న జూల‌ప‌ల్లిలోని ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. రెండు రోజుల క్రితం […]

Advertisement
Update:2015-10-01 20:32 IST

పాఠ‌శాల‌లో తోటి విద్యార్థుల‌ ముందు నిల‌బెట్టార‌న్న‌ అవ‌మానంతో ఓ విద్యార్థి రైలు కింద‌ప‌డి ప్రాణాలు తీసుకున్నాడు. చ‌నిపోయే ముందు తాను ఎందుకు చ‌నిపోతున్నానో వివ‌రిస్తూ.. ఓ వీడియో కూడా తీసుకున్నాడు. క‌రీంన‌గ‌ర్ జిల్లా పెద్ద‌ప‌ల్లి రైల్వేట్రాక్‌పై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాలు.. క‌రీంన‌గ‌ర్ జిల్లా అబ్బాపురానికి చెందిన శ్రీ‌నివాస‌రెడ్డి- అంజ‌లి దంప‌తుల‌కు ముగ్గురు సంతానం. వీరిలో సంతోష్‌రెడ్డి చిన్న‌వాడు. ప‌క్క‌నే ఉన్న జూల‌ప‌ల్లిలోని ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. రెండు రోజుల క్రితం ఫీజు చెల్లించాల‌ని క‌ర‌స్పాండెంట్ స‌త్యం విద్యార్థుల‌కు సూచించాడు. బుధ‌వారం పాఠ‌శాల‌కు వెళ్లిన సంతోష్‌రెడ్డిని, ఫీజు చెల్లించ‌ని మ‌రికొంద‌రు విద్యార్థుల‌ను స‌త్యం అంద‌రిముందు నిలుచోబెట్టాడు. న‌లుగురిలో త‌న‌ను నిలుచోబెట్ట‌డం అవ‌మానంగా భావించిన సంతోష్ తీవ్ర‌మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్‌లో పాఠ‌శాల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌కు మ‌న‌స్తాపం చెందే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని, త‌న గురించి వెద‌క వ‌ద్ద‌ని కోరుతూ వీడియో తీశాడు. త‌రువాత అదృశ్య‌మ‌య్యాడు. ఇది గ‌మ‌నించిన తండ్రి శ్రీ‌నివాస్‌రెడ్డి హుటాహుటిన ధ‌ర్మారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఇంత‌లో పెద్ద‌ప‌ల్లి రైల్వేట్రాక్‌పై విద్యార్థి మృత‌దేహం ఉంద‌ని స‌మాచారం వ‌చ్చింది. దీంతో శ్రీ‌నివాస్‌రెడ్డి దంప‌తులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News