PSLV-C30 గగన విజయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సోమవారం ఉదయం పది గంటలకు పీఎస్ఎల్వీ సీ30 రాకెట్‌ను నెల్లూరుజిల్లా శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఒక స్వదేశీ, ఆరు విదేశీ ఉపగ్రహాలను తీసుకుని నిప్పులు చెరుగుతూ పీఎస్ఎల్పీ నింగి వైపు దూసుకెళ్లింది. ప్రయోగం 25. 32 నిమిషాల్లో పూర్తయింది. ముందుగా భారత్‌కు చెందిన అస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని కక్షలో వదిలిపెట్టింది. అనంతరం ఇండోనేషియా, కెనడా, నాసాకు చెందిన […]
Advertisement
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సోమవారం ఉదయం పది గంటలకు పీఎస్ఎల్వీ సీ30 రాకెట్‌ను నెల్లూరుజిల్లా శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఒక స్వదేశీ, ఆరు విదేశీ ఉపగ్రహాలను తీసుకుని నిప్పులు చెరుగుతూ పీఎస్ఎల్పీ నింగి వైపు దూసుకెళ్లింది. ప్రయోగం 25. 32 నిమిషాల్లో పూర్తయింది. ముందుగా భారత్‌కు చెందిన అస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని కక్షలో వదిలిపెట్టింది. అనంతరం ఇండోనేషియా, కెనడా, నాసాకు చెందిన శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టింది పీఎస్ఎల్పీ సీ30.
దేశానికి చెందిన ఆస్ట్రోశాట్ బరువు 1513 కిలోలు. ఉపగ్రహానికి ఏర్పాటు చేసిన రెండు వేల ఓల్ట్‌ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్లేట్ల ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఖగోళ అధ్యయనంలో ఆస్ట్రోశాట్ ఉపయోగపడనుంది.
Advertisement