ఏపీ నెత్తిన బెంగాల్ అణు కుంపటి

 ఏపీనెత్తిన మరో అణు కుంపటి మోపేందుకు రంగం సిద్ధమవుతోంది.  పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లా హరిపూర్‌లో ఏర్పాటు చేయాలనుకున్న 6వేల మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్‌ను ఏపీకి తరలించే యోచనలో కేంద్రం ఉంది.  ఈ విషయాన్ని  నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా ధృవీకరిస్తున్నారు.  హరిపూర్‌లో ప్లాంట్ ఏర్పాటును బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.  స్థానిక రైతులు, మత్య్సకారులు, ఎన్‌జీవోలు పెద్దెత్తున ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.  దీంతో 2011లో ప్రతిపాదించిన ప్లాంట్  ముందుకు సాగడం […]

Advertisement
Update:2015-09-28 10:26 IST
ఏపీనెత్తిన మరో అణు కుంపటి మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లా హరిపూర్‌లో ఏర్పాటు చేయాలనుకున్న 6వేల మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్‌ను ఏపీకి తరలించే యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయాన్ని నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా ధృవీకరిస్తున్నారు. హరిపూర్‌లో ప్లాంట్ ఏర్పాటును బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. స్థానిక రైతులు, మత్య్సకారులు, ఎన్‌జీవోలు పెద్దెత్తున ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో 2011లో ప్రతిపాదించిన ప్లాంట్ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీపై కన్నేసింది కేంద్రం.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య ఈ 6వేల మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు తుదిదశకు వచ్చినట్టు తెలుస్తోంది. హరిపూర్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌ను ఏపీకి తరలించే ఆలోచన చేస్తున్న మాట వాస్తవమేనని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఒకరు అంగీకరించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య ప్లాంట్ ఏర్పాటుకు అనుకూమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్లాంట్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
అయితే అణు కుంపటిని స్థానిక ప్రజలకు ఎంతవరకు స్వాగతిస్తారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను దేశంలో ఏ ప్రాంతం వారు కూడా ఆహ్వానించిన దాఖలాలు లేవు. అణు ప్లాంట్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రేడియేషన్, పర్యావరణంపై ఇతర తీవ్ర ప్రభావాలు ఉంటాయన్న భావన బలంగా ఉంది. అనుకోకుండా ఏదైన ప్రమాదం జరిగితే ఆస్తి , ప్రాణనష్టం ఊహించడం కూడా కష్టమని పర్యావరణ,సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News